వారుణాస్త్రం సంధించిన బంగాళాఖాతం..ఈ జిల్లాల్లో భారీవర్షాలు!
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలలో ఉపరితల ఆవర్తనం తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని imd హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరాల మీదుగా వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు జిల్లాలకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నేడు తెలంగాణా రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సమాచారం.

ఈ జిల్లాలకు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్
నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, కే సూర్యాపేట, సంగారెడ్డి , నిజామాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రేపు పది జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
మరో అల్ప పీడనానికి ఛాన్స్
ప్రధానంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు సెప్టెంబర్ 13వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని imd అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో సెప్టెంబరు నెలాఖరు వరకు వర్షాలు
ఈ అల్పపీడన ప్రభావంతోను తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సెప్టెంబరు నెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications