తెలంగాణ పోలీసు నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి పెంపు.. ఈరోజు రాత్రి 10.00 గంటలకు ముగియనున్న గడువు

తెలంగాణ పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం మరో రెండు సంవత్సరాలు పొడిగించింది. పోలీసు నియామక మండలి చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో మొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని యువత కోల్పోయినందున వయో పరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల వయోపరిమితిని పెంచిన విషయానికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ను, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Raising the age limit of candidates in Telangana police recruitment

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరికొంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని, దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే పొడిగించే పరిస్థితే లేదని పోలీసు నియామక మండలి గతంలోనే స్పష్టత ఇచ్చింది. ఈరోజుతో గడువు ముగియనుంది. ఈరోజు రాత్రి 10.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+