పర్యటకులను ఆకర్షిస్తోన్న 'రామగిరి ఖిల్లా'.. పూర్తి విశేషాలు ఇవే..
కరీంనగర్ లోని రామగిరి ఖిల్లా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక చరిత్రను కలిగి ఉంది. ఇక్కడి ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, పురాతన కట్టడాలు, రాతి శిల్పాలు, కోట గుమ్మాలు, పురాతన దేవాలయాలు పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. రీల్స్ , యూ ట్యూబ్ షార్ట్స్ కారణంగా ఇటీవల కోట గురించి అనేక మందికి తెలిసింది. దాంతో ఇటీవలి కాలంలో రామగిరి ఖిల్లాకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో పిల్లలతో ఎంచక్కా రామగిరి కోట అందాలను వీక్షిస్తున్నారు.
కరీంనగర్ లోని రామగిరి ఖిల్లాలో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈ ఖిల్లాలో శత్రు దుర్భేద్యమైన కోటలు, రాతి కట్టడాలు, ఔషధాలకు నెలవైన మొక్కలు, సెలయేర్లు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు పర్యటకుల్ని మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఈ ప్రాంతానికి సీతా రామ లక్ష్మణులు నడిచిన నేలగా.. ఎందరో రాజ వంశస్థులు పరిపాలించిన ప్రాంతంగా పేరుగాంచింది.
ఇక రామగిరి ఖిల్లాలో ఫిరంగి, బ్రహ్మగుండం, మల్లెవనం, శివాలయం, సీతారామాలయం, సీతారాము పాదముద్రలు, సీతమ్మకొలను, తాటికోట, సింహాలకోట, పసుపు కుంకుమరాళ్లు, చింతకోట, నిమ్మకోట, కుర్మగుండం, సప్తమాత్రికలు, బృందావనం, ధనధాన్యపు బావులు.. తదితర చారిత్రక కట్టడాలు ఇక్కడ వీక్షించే అవకాశం ఉంది. అలాగే రామగిరి ఖిల్లాపై ఎన్నో మూలిక చెట్లు ఉన్నాయి. 250 రకాల ఔషధ మూలికలు, సుగంధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నట్లు మూలిక వైద్యులు గుర్తించారు.
రామగిఖిల్లాను గోల్కొండ కోట మాదిరిగా నిర్మించారు అప్పటి రాజులు. శత్రువులు రాకుండా 120 అడుగుల మేర గోడ కట్టారు. ఈ ఖిల్లాపై నిర్మించిన కోటలు, బురుజులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అలాగే శత్రువుల ఉనికిని పసిగట్టేలా ఖిల్లాకు ఇరువైపులా బురుజులను నిర్మించారు. శత్రు సైన్యం కోట మీదకి రాకుండా చుట్టూ 3 నుంచి 120 అడుగుల ఎత్తు రాతిగోడను నిర్మించారు. రామగిరి ఖిల్లా పైనుంచి చూస్తే 25 కి. మీ. ల దూరంలోని గోదావరి నది కూడా కనిపిస్తుంది.

రామగిరి ఖిల్లాను చేరుకోవాలంటే.. ముందుగా పర్యటకులు పెద్దపల్లి- మంథని ప్రధాన రహదారి బేగంపేట క్రాస్ రోడ్డు వద్ద దిగాలి. అక్కడి నుంచి బస్సు లేదా ఆటోలో 4 కి. మీ. ప్రయాణిస్తే బేగంపేట గ్రామ శివార్లోకి చేరుకుంటారు. ఇక అక్కడ నుంచి 3 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్తే రామగిరి ఖిల్లాకు చేరుకోవచ్చు. అయితే పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో పర్యటకులు ఓ గ్రూప్ గా సందర్శించడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications