మహేష్ కత్తిపై షాకింగ్ కామెంట్స్: 'నేనే తీసుకొచ్చా, తప్పునాదే, చెత్త బుట్టలో వేస్తా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తికి సినిమా ఇండస్ట్రీ వారు భగ్గుమంటున్నారు. పవన్ వంటి వ్యక్తిపై ఇష్టారీతిన మాట్లాడటం సరికాదంటున్నారు. ఆయన ఓ మంచి పని కోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే ఇలాంటి చర్యలు ఖండించదగ్గవని అంటున్నారు.

మెట్టు దిగిన మహేష్ కత్తి కానీ: 'పవన్‌ను నేను అడుగుతా, ప్రతివాడూ అభిమానేనా'

వేణుమాధవ్, కోన వెంకట్ వంటి వారు చాలామంది మహేష్ కత్తి తీరును ఖండించారు. ఇటీవలే నటుడు, నిర్మాత రాంకీ కూడా ఆయన తీరును ఓ ఇంటర్వ్యూలో ఖండించారు. అంతేకాదు, ఆయనపై రాంకీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది రీట్వీట్ చేశారు. రాంకీ మాట్లాడిన వీడియోను పెట్టి.. మహేష్ కత్తి లేడీస్‌తో మిస్ బిహేవ్ చేసేవాడని దీనిని బట్టి అర్థమవుతోందని, ఇలాంటి వారికి అండగా నిలవవద్దని కోరారు.

ఇచ్చి వెళ్లు: మహేష్ కత్తి రివర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మద్దతుగా ఇలా!!

 నేను చెత్త అని చెప్పమనండి

నేను చెత్త అని చెప్పమనండి

ఆ వీడియోలో రాంకీ.. మహేష్ కత్తిపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ హీరో కాదని మహేష్ కత్తి అనడాన్ని రాంకీ ఖండించారు. ఇప్పుడు కేసీఆర్ సీఎం కాదంటే అవుతారా అని ప్రశ్నించారు. పవన్ యాక్టర్ కాదు అనే వాడు మనిషేనా అన్నారు. పూనమ్ కౌర్ ఏదో తెలిసి తెలియక ఏదో మెసేజ్ పెడితే ఓ అమ్మాయి పట్ల అలాగేనా వ్యవహరించేదని మండిపడ్డారు. క్రిటిక్ అంటే జీవితం నాశనం చేసే చీడపురుగా అని ప్రశ్నించారు. అదే అయితే తాను ఇండస్ట్రీకి పట్టిన చెత్త అని చెప్పమనండి అన్నారు.

 బాయ్ టిఫిన్ తీసుకు రాలేదని వెళ్లిపోయాడు

బాయ్ టిఫిన్ తీసుకు రాలేదని వెళ్లిపోయాడు

చదువుకున్నవాడు అయితే తెలివి తేటలు చూపించాలని, కానీ ఫ్యాన్స్ అంటే అన్ని రకాల వారు ఉంటారని, వారికి స్పందించడం ఏమిటని రాంకీ ప్రశ్నించారు. మహేష్ కత్తి ఇర్రెస్పాన్సిబులిటీ సిటిజన్ అని, తనకు తెలిసి సినిమా నాలెడ్జ్ జీరో అన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఓ అనుభవాన్ని చెప్పారు. మహేష్ కత్తి తన ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారని, ఓ రోజు బాయ్ టిఫిన్ తీసుకు రాలేదని పోస్ట్ ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంత ఇర్రెస్పాన్సిబులిటీ వ్యక్తి అన్నారు.

 ఫోజులు కొడితే, ఎలా, నాదే తప్పు

ఫోజులు కొడితే, ఎలా, నాదే తప్పు

తాను రోడ్డున పోయే వాడికి డైరెక్షన్ అవకాశమిద్దామనుకుంటే పోజులు కొడితే ఎలా అని రాంకీ ప్రశ్నించారు. మహేష్ కత్తిని తీసుకు రావడంలో తనదే తప్పు అన్నారు. పవన్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. అసలు పవన్ విషయంలో మహేష్ కత్తి మొదలు పెట్టారని అన్నారు. అలాంటప్పుడు పవన్ ఎందుకు వస్తాడని ప్రశ్నించారు. మహేష్ కత్తిని ప్రారంభించమని చెప్పలేదని, అలాంటప్పుడు ఆపమని అభిమానులకు ఎలా చెబుతారన్నారు. తనకు టీవీ 9 అవార్డు వచ్చిందని, మహేష్ కత్తి లాంటి వాళ్లను ప్రోత్సహిస్తే వారి అవార్డు వెనక్కి ఇస్తానని చెప్పారు. అమ్మాయి గురించి అంతసేపు చూపించడం సరికాదన్నారు. ఆధారాలు చూడకుండా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు.

అసలు ఎవరు నువ్వు

అసలు ఎవరు నువ్వు

అసలు ఆయన ఎవరు అని రాంకీ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఎవరినైనా నాశనం చేశాడా, ఎవడి సొమ్ము అయినా తిన్నాడా అని ప్రశ్నించారు. అసలు పవన్ సినిమాలు చేసుకుంటే డబ్బు వస్తుందని, కానీ సమాజం పట్ల బాధ్యత ఆలోచించి రాజకీయాల్లో అడుగు పెట్టారన్నారు. అసలు సమాజానికి నువ్వేం చేశావని, ఏం చేయకుండా ఆయనను ఎలా ప్రశ్నిస్తావని అడిగారు. హక్కు గురించి మాట్లాడే ప్రతి వాడు బాధ్యత గురించి తెలుసుకోవాలన్నారు. ఒక అమ్మాయిని లాగడం సరైనదేనా అని ప్రశ్నించారు.

అమ్మాయిలపై ఇలా అంటూ, ఓ అమ్మాయిని నెంబర్ అడిగారు

అమ్మాయిలపై ఇలా అంటూ, ఓ అమ్మాయిని నెంబర్ అడిగారు

ఓ సినిమాకు ఆయనకు దర్శకత్వం కోసం అవకాశమిచ్చామని, ఆయన హీరోయిన్ కోసం 200 మంది అమ్మాయిలను ఆడిషన్ చేశారని రాంకీ చెప్పారు. అంతమందిని ఎందుకు చేశారో అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత తనకు మెసేజ్‌లు వచ్చాయని, మహేష్ కత్తి ఏవో మెసేజ్‌లు పెడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఇటీవల ఓ హోటల్ నుంచి ఓ అమ్మాయి బయటకు వెళ్తుంటే నెంబర్ అడిగాడు అని చెప్పారు.

అమ్మాయి అంటే టైంపాస్

అమ్మాయి అంటే టైంపాస్

అమ్మాయితో మాట్లాడటం అంటే మహేష్ కత్తికి టైంపాస్ అని ఆ తర్వాత తెలిసిందని రాంకీ చెప్పారు. ఆయనను వుమనైజర్ అంటామా.. అంతపెద్ద మాట తనకు రాదు కానీ ఏ అమ్మాయి నుంచి మహేష్ కత్తిపై మంచి రివ్యూ రాలేదన్నారు. ఏదో మెసేజ్ పెడతారని చెప్పేవారన్నారు. అమ్మాయి అంటే అతనికి విలువ లేదన్నారు. సమాజం, జనం గురించి అవసరం లేదన్నారు. మహేష్ కత్తి తన సినిమాకు దర్శకుడిగా పనికిరాడని వారం, పది రోజుల తర్వాత తెలిసిందని రాంకీ అన్నారు. దీంతో అతనిని తీసేశానని చెప్పారు.

 మహేష్ కత్తి పేరు పెట్టమంటే చెత్తబుట్టలో వేస్తా

మహేష్ కత్తి పేరు పెట్టమంటే చెత్తబుట్టలో వేస్తా

తాను ఓ సినిమా నిర్మిస్తున్నానని, ఆ సినిమా లైన్ మహేష్ కత్తిదే అని, కానీ తాను ఆయన పేరు వేయనని రాంకీ చెప్పారు. అతని పేరు వేయాలంటే డస్ట్ బిన్‌లో వేస్తానని లేదంటే పవన్ అభిమానులకు క్షమాపణ చెప్పాలని చెప్పారు. అప్పుడు అతని పేరు పెడతానని చెప్పారు. ఫ్యాన్స్ అంటే ఎవరని నిలదీశారు. ఫ్యాన్ పెట్టే భిక్షతో ఇండస్ట్రీ నడుస్తోందని చెప్పారు. ప్రేక్షకుడు లేకుంటే సినిమానే లేదన్నారు. అలాంటప్పుడు ఇక క్రిటిక్ ఎక్కడ అన్నారు. ఎవరు ఏం చెప్పినా అది తెలుసంటాడని విమర్శించారు. లా గురించి మాట్లాడితే అది తెలుసంటాడు, సినిమా అంటే అదీ తెలుసంటాడు.. ఏది అడిగితే అది తెలుసు అంటాడని, కానీ ఆయనకు సినిమా విషయంలో జీరో నాలెడ్జ్ అన్నారు. ఆయనకు ఏదో మానసిక సమస్య ఉందని ఇటీవల ఓ కాలర్ చెప్పారని గుర్తు చేశారు.

 రెచ్చగొడతారా, బాహుబలిని కూడా తప్పుబట్టారు

రెచ్చగొడతారా, బాహుబలిని కూడా తప్పుబట్టారు

మహేష్ కత్తి ఇండస్ట్రీ నుంచి బహిష్కరింపబడే వ్యక్తి అని రాంకీ చెప్పారు. అతని వెనుక ఇండస్ట్రీకి చెందిన కొందరు ఉన్నారని తెలుస్తోందని చెప్పారు. అసలు అభిమానులను ఎందుకు రెచ్చగొట్టాలని ప్రశ్నించారు. అభిమానులకు బట్టి మనం నడుచుకోవాలన్నారు. నీ పిచ్చి రాతలతో హిట్ సినిమాలను కూడా ఫట్ అంటావన్నారు. బాహుబలిని కూడా తప్పుబట్టిన వ్యక్తి అన్నారు. నీలాంటి వాడికి పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్పాలా అన్నారు. అసలు పవన్‌ను పిలిచి కూర్చోబెట్టే స్థాయి నీదా అన్నారు.

మహేష్ కత్తి మొదట వ్యక్తిగత విషయాలు తీశారు

మహేష్ కత్తి మొదట వ్యక్తిగత విషయాలు తీశారు

పవన్ వ్యక్తిగత విషయాల గురించి మొదట మహేష్ కత్తి తీశారని రాంకీ అన్నారు. అయినా వివేక్ అనే దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మీ తల్లి గారి గురించి ఓ రెండు నిమిషాలు చెప్పమని గౌరవప్రదంగా అడిగారని చెప్పారు. కుటుంబ నేపథ్యం అడిగితే తప్పేమిటన్నారు. నేను నా తల్లిదండ్రుల గురించి చెప్పమంటే గర్వంగా చెబుతానన్నారు. మహేష్ కత్తికి చెప్పడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. నా పేరెంట్స్ తలదించుకునే పని చేయలేదన్నారు. ఎవరు కూడా ఇతనిని నీ భార్య నీ దగ్గర ఉండది కదా, ఎక్కడో ఉన్నది అని, ఎక్కడో వదిలేశారంట, లేకుంటే ఆరు నెలలకు ఓసారి వస్తారట కదా అని అడగలేదు కదా అన్నారు. ఎవరితోనైనా తిరగడం చూశామని ఎవరైనా పర్సనల్‌గా మాట్లాడారా అన్నారు.

ఒకటి తర్వాత ఒకటి అడుగుతారు

ఒకటి తర్వాత ఒకటి అడుగుతారు

అమ్మాయిని అనేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని, అమ్మ గురించి అడిగితేనే బాధపడ్డ నీకు అమ్మాయి గురించి ఏమేమో ఎలా మాట్లాడుతావని ప్రశ్నించారు రాంకీ. పవన్ రెండో పెళ్లి, మూడోపెళ్లి అని అనడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన పర్సనల్ నీకు ఎందుకని నిలదీశారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలియదా అన్నారు. పవన్ కూడా ఒక్కో సమస్యపై నిలదీస్తున్నారని, ఒకటి తర్వాత ఒకటి అడుగుతారని చెప్పారు. అసలు నువ్వెవరు అడగడానికి అన్నారు. నీకు నచ్చకుంటే జనసేనకు ఓటు వేయకన్నారు. అమ్మగారి గురించి రెండు నిమిషాలు మాట్లాడరాని, అది అడిగితే పర్సనల్ విషయం అనే నీవు, పవన్ రెండో భార్య గురించి అవసరమా అని ప్రశ్నించారు. ఆ హక్కు ఉందా అన్నారు. హక్కు గురించి ప్రశ్నించే ముందు బాధ్యత తెలుసుకోవాలన్నారు. ఆయన వల్ల ఇండస్ట్రీలో ఒక్కరికైనా ముద్ద దొరికిందా అన్నారు. పవన్ అభిమానుల నుంచి ప్రమాదం అనుకుంటే పొరపాటు అన్నారు. వారు ఏదో చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Kathi misbehaving with ladies... Here is the artifact... Media... My humble request, ... Please don't entertain such people...requesting u to please verify backgrounds upfront....' Hyper Aadi tweetd.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి