రమ్య మృతి ఎఫెక్ట్: బార్ లైసెన్స్ రద్దు, 'కలత చెందిన కేసీఆర్'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఈ నెల 1వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ చిన్నారి రమ్య మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఓ బార్ పైన సోమవారం నాడు కొరడా ఝులిపించింది.

ఈ ప్రమాదానికి ప్రధాన కారణం నిందితులు శ్రావిల్, అతని స్నేహితులు బాగా తాగడమే. వారు మైనర్లు. వారు మైనర్లు అని తెలిసి లిక్కర్ ఇచ్చినందున.. వారు ఏ బార్‌లో అయితే మందు తాగారో ఆ బార్ లైసెన్స్‌ను ఎక్సైజ్ శాఖ ఈ రోజు రద్దు చేసింది. ఆ బార్ పేరు టీజీఐ ఫ్రైడే అని తెలుస్తోంది.

రమ్య కుటుంబంలో మరో విషాదం: చికిత్స పొందుతూ తాత మృతి
బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 2లో ఈ నెల 1వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య(9) కేర్‌ ఆస్పత్రిలో పది రోజుల క్రితం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే.

Ramya death affect: Bar Licence cancelled

ఒకటో తేదీన రమ్య తొలిరోజు పాఠశాలకు వెళ్లి తన తల్లి, రాధిక, బాబాయిలు రమేష్‌, రాజేష్‌, తాత మధుసూదనాచారితో కలిసి బంజారాహిల్స్‌ వైపు కారులో వస్తుండగా, మరోకారులో తప్పతాగిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు వస్తున్నారు.

రమ్య మృతి ఎఫెక్ట్: ఒకేరోజు 269 మంది మైనర్లు, బతిమాలిన పేరెంట్స్
ఆ సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థుల కారు ఎగిరి రమ్య కుటుంబం ఉన్న కారు పైన పడింది. ఈ ప్రమాదంలో రమ్య బాబాయి రాజేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. రమ్యను బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. రమ్య బ్రెయిన్‌ డెడ్ అయింది. వారం క్రితం మృతి చెందింది.

కలత చెందిన కేసీఆర్: తలసాని

చిన్నారి రమ్య ప్రమాద ఘటనపై కేసీఆర్ కలత చెందారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రమ్య మృతి నేపథ్యంలో ముందు జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేస్తే తర్వాత కుటుంబ సభ్యులకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Exice department cancelled Bar licence on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి