సిటీలో దారుణం: కదులుతున్న క్యాబ్‌లో టెక్కీపై లైంగిక దాడి, నిందితుల్లో కానిస్టేబుల్

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వేచివున్న యువతిని ఇంటివద్ద చేరుస్తామంటూ ఇద్దరు యువకులు నమ్మించారు. క్యాబ్‌ ఎక్కించుకుని 45 కి.మీ ప్రయాణించాక కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచార య

హైదరాబాద్‌: నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వేచివున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని ఇంటివద్ద చేరుస్తామంటూ ఇద్దరు యువకులు నమ్మించారు. క్యాబ్‌ ఎక్కించుకుని 45 కి.మీ ప్రయాణించాక కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు.

ఎల్బీనగర్‌ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌ చౌరస్తాలో బుధవారం అర్ధరాత్రి దాటాక 2.30గంటలకు ఓ యువతి విజయవాడ వెళ్లేందుకు జాతీయ రహదారిపై వేచివుంది. అక్కడే ఉన్న నలుగురు యువకుల్లో ఇద్దరు ఆమెపై కన్నేశారు. తమ స్నేహితుడైన క్యాబ్‌డ్రైవర్‌ వద్ద వాహనాన్ని తీసుకుని ఆమె ముందు ఆపి ఎక్కడికెళ్లాలని అడిగారు. దీంతో ఆమె విజయవాడ అని తెలిపింది.

rape attempt

కాగా, విజయవాడ వరకూ దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు యువకులు. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌గేట్‌ దాటాక ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. ఆమె అరుపులు విని అక్కడి స్థానికులు కారును ఆపేందుకు యత్నించగా, యువతిని అక్కడే వదిలేసి.. యువకులు కారుతో సహా పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్‌ పోలీస్ స్టేషన్‌లో నిర్భయకేసు నమోదైంది.

ఆ తర్వాత కేసు ఎల్బీనగర్‌ పీఎస్‌కు కేసు బదిలీ చేశారు. ఈ కేసును ఛేదించేందుకు విచారణను ఉన్నతాధికారులు రాచకొండ ఎస్‌వోటీ బృందానికి అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింగరావు పర్యవేక్షణలో ఎస్సైలు కాశీవిశ్వనాథ్‌, ఆంజనేయులు ఆధ్వర్యంలోని 3 బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యాబ్‌‌ని కనిపెట్టారు. మౌలాలికి చెందిన సదరు యువకులను అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్‌ పీఎస్‌కు తరలించారు.

నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్ కూడా..

నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్ తోపాటు నికోలస్ అనే మరో వ్యక్తి ఉన్నారని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. అంత అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా విజయవాడకు, అది కూడా ఓ ప్రైవేట్ క్యాబ్‌లో ఎందుకు వెళ్లాలనుకున్నావని ఆ మహిళను ప్రశ్నంచగా.. అది తనకు అలవాటేనని ఆమె జవాబిచ్చినట్లు చెప్పారు. మహిళలు ఇలా ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దని, వీలైనంత వరకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులలోనే వెళ్లాలని ఆయన సూచించారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. తమ వద్ద 'సేఫ్ క్యాబ్' అని రిజిష్టర్ అయిన క్యాబ్ లలలోనే వెళ్లాలని సీపీ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+