నెహ్రూ జూలో ఆసియాలోనే అరుదైన విషరహిత పాము ఇదే
హైదరాబాద్: ఆసియా ఖండంలో చాలా అరుదుగా కనిపించే పామును బుధవారం జూపార్కు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 45 సెంటిమీటర్ల పొడువు గల ఈ పాము చూడటానికి త్రాచుపాములా ఉంది.

తల భాగం పసుపు పచ్చ వర్ణంలో ఉంది. జూపార్కు సమీపంలోని అబూబకర్ మసీదు ఆవరణలో ఈ పాము కనిపించిందని స్థానికులు జులై 28న జూ అధికారులకు సమాచారమందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న ఎనిమల్ కీపర్ ప్రభాకర్ దాన్ని పట్టుకున్నారు. ఇది చాలా అరుదైన పాము అని జూపార్క్ క్యూరేటర్ శివానీడొంగ్రే తెలిపారు. ఎల్లో కాలర్డ్ ఓల్ఫ్ జాతికి చెందిన ఈ పాములు దక్షిణాదిలో అధికంగా కనిపిస్తాయని, విషపూరితం కావని ఆమె చెప్పారు. ప్రస్తుతం జూ పార్క్‌లోని పాముల ఎన్‌క్లోజర్‌లలో ఈ పామును వదిలిపెట్టినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications