గచ్చిబౌలిలో టెకీల రేవ్ పార్టీ.. గంజాయి మత్తులో.. అసలేం జరిగిందంటే!
రేవ్ పార్టీ.. రేవ్ పార్టీలు నిర్వహించడం నేరమని, ఎన్నో సందర్భాలలో ఎంతో మందిని అరెస్టు చేస్తున్నప్పటికీ చాప కింద నీరు లాగా రేవు పార్టీ సంస్కృతి ఇంకా మెట్రోపాలిటన్ నగరాలలో విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరుగుతున్న ఓ రేవ్ పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు.
గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎన్జీవో కాలనీలో ఒక గెస్ట్ హౌస్ లో పుట్టినరోజు వేడుకల పేరుతో రేవ్ పార్టీని నిర్వహించారు కొందరు టెకీలు. ఇక దీనిపైన సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు రంగంలోకి దిగి అక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అబ్బాయిలను, అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ఈ పార్టీలో మొత్తం 20 మంది ఉన్నారు. అందులో 12 మంది యువకులుగా, 8 మంది అమ్మాయిలు సమాచారం.

రేవ్ పార్టీలో మద్యంతో పాటు గంజాయి, ఈ సిగరెట్స్
వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పోలీసులు చెబుతున్నారు. వీరి నుండి గంజాయి ప్యాకెట్లను, ఈ సిగరెట్లను, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎస్వోటీ పోలీసులు, ఆపై మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు వీరిని అప్పగించారు. ఈ ఘటన పైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలో స్టూడెంట్స్ ఎవరూ లేరని సమాచారం.
ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్, పార్టీలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు
ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ డిటెక్ట్ టెస్ట్ చేయగా ముగ్గురు యువకులకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయులు. సాయి ఆదిత్య అనే యువకుడు బర్త్ డే పార్టీ కావడంతో ఈ బర్త్ డే పార్టీ సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు.ఈ రేవ్ పార్టీలో పట్టుబడిన ఇద్దరు అమ్మాయిలు జూనియర్ ఆర్టిస్టులని తెలిపారు.
వారికి పోలీసుల నోటీసులు, పార్టీలో గంజాయిపై విచారణ
పార్టీలో పట్టుబడిన యువకులలో ఇద్దరు రైల్వే కాంట్రాక్టు ఉద్యోగులు కాగా మిగతా వారంతా ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వారనీ గచ్చిబౌలి సిఐ ఆంజనేయులు వెల్లడించారు. ఇక ఒక గెస్ట్ హౌస్ లో పార్టీ నిర్వహించిన వారికి పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ రేవ్ పార్టీలో గంజాయి పట్టుబడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications