Rayalaseema Express: రాయలసీమ ఎక్స్ ప్రెస్ కు హైదరాబాద్ లో కొత్త స్టాప్..!
హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా సమీపంలో ఉండే రైల్వే స్టేషన్లలో ప్రధాన రైళ్ల స్టాప్ ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలా పలు రైళ్లకు స్టాపుల కోసం దక్షిణ మధ్య రైల్వే దగ్గర డిమాండ్లు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఒక డిమాండ్ కు తాజాగా మోక్షం కలిగింది. రాయలసీమ ఎక్స్ ప్రెస్ (rayalaseema express)కు హైదరాబాద్ లో ఇలాంటిదే ఓ స్టాప్ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని తిరుపతి నుంచి తెలంగాణలోని నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ ఎక్స్ ప్రెస్ కు హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నుంచి చాలా డిమాండ్ ఉంది. ఇందులో భాగంగా బొల్లారం స్టేషన్ లో తమకు స్టాప్ కావాలని వారు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీంతో బొల్లారం స్టేషన్లో రాయలసీమ ఎక్స్ ప్రెస్ కు కొత్తగా ఒక నిమిషం పాటు హాల్ట్ ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదీ ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో బొల్లారంలో రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎక్కే ఐటీ ఉద్యోగులకు ఊరట దక్కింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే రైలు ఉదయం 6.19కు ఇక్కడకు వస్తుంది. అలాగే నిజామాబాద్ నుంచి వచ్చే రైలు సాయంత్రం 4.09కు వస్తుంది.

రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12793/12794) తిరుపతి నుండి నిజామాబాద్ మధ్య రోజూ రాకపోకలు సాగిస్తుంది. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు,కడప,అనంతపురం,కర్నూలు మీదుగా వెళ్తూ తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్ ను ఇది కలుపుతుంది. 12793 నంబర్ రైలు తిరుపతి నుండి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి, సికింద్రాబాద్ కు ఉదయం ఉదయం 6:15కి, నిజామాబాద్ కు 9:25కి చేరుతుంది. అలాగే 12794 నంబర్ రైలు నిజామాబాద్ లో మధ్యాహ్నం 2:15 కు బయలుదేరి తిరుపతికి మరుసటి రోజు ఉదయం 6:15కి చేరుకుంటుంది. దీనికి ఇప్పుడు బొల్లారంలో హల్ట్ ఇచ్చారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!












Click it and Unblock the Notifications