కొండా సురేఖ విషయంలో నాగార్జున నో కాంప్రమైజ్ వెనుక.. హాట్ డిబేట్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కొండా సురేఖ వ్యాఖ్యలపైన నాగార్జున తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ నాగార్జున వెనక్కు తగ్గడం లేదా? కొండా సురేఖ వ్యాఖ్యలు మాత్రమే కాక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో కాంగ్రెస్ సర్కారు పైన కూడా నాగార్జున తీవ్ర అసహనంతో ఉన్నారా? ఈ క్రమంలోనే ఆయన కొండా సురేఖ ఇష్యూ ని సీరియస్ గా తీసుకుంటున్నారా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

కొండా సురేఖ పదేపదే టార్గెట్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పైన సమంత పైన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే కొండా సురేఖ తాను కేటీఆర్ ను విమర్శించే క్రమంలో భావోద్వేగానికి గురై వ్యాఖ్యలు చేశానని తనను క్షమించమని చెప్పినప్పటికీ సురేఖను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

Reason behind Nagarjuna no compromise on Konda Surekha Hot debate

సురేఖ విషయంలో వెనక్కు తగ్గని నాగార్జున
ఏకంగా నాగార్జున కొండ సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసి ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క కొండ సురేఖ తాను పొరపాటుగా మాట్లాడానని పదేపదే చెబుతున్నప్పటికీ నాగార్జున సురేఖ విషయంలో వెనక్కి తగ్గరని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతుంది.

వదిలిపెట్టేది లేదని చెప్తున్న అక్కినేని ఫ్యామిలీ
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా ఒక కారణమని భావిస్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తన కోపాన్ని తీర్చుకోవడానికి నాగార్జున కొండా సురేఖ వ్యవహారాన్ని వదిలిపెట్టబోరని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. కొండా సురేఖ పదేపదే క్షమాపణలు చెప్పినప్పటికీ కొండా సురేఖ తరఫున పొన్నం ప్రభాకర్ లాంటివాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ ఎవరేం మాట్లాడిన ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని అక్కినేని ఫ్యామిలీ తేల్చి చెబుతుంది.

కాంగ్రెస్ సర్కార్ ను టార్గెట్ చేయటానికి ఆయుధం
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నాగార్జున తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోగా ఆ నష్టం నుంచి బయటపడడానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత పోయిన పరువును తిరిగి దక్కించుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నాడు. ఇక ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు అక్కినేని ఫ్యామిలీ పైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి నాగార్జున దీనిని ఆయుధంగా మార్చుకున్నారు.

కొండా సురేఖ ద్వారా రేవంత్ పై బడా స్కెచ్
ఈ క్రమంలోనే ఈ విషయంలో నాగార్జున ఎవరు చెప్పినా వినరు అని కొండా సురేఖ విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు నాగార్జున సిద్ధమయ్యారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తుండగా కొండా సురేఖ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం దాకా తీసుకువెళ్లి ఆమెకు చెక్ పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. కొండా సురేఖను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి పై బడా స్కెచ్ వేసిన నాగార్జున అందుకే ఈ వ్యవహారంలో కొంచెం కూడా వెనక్కు తగ్గడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+