అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తోన్నాయ్..: ఏకి పారేసిన రేణు దేశాయ్

ప్రముఖ నటి రేణు దేశాయ్.. మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓ సామాజిక అంశంపై ఆమె స్పందించారు. అధికారులు తీసుకొచ్చిన చర్యలను తప్పుపట్టారు. వారిపై నిప్పులు చెరిగారు. సమాజంలో చోటు చేసుకుంటోన్న ఎన్నో సమస్యలపై ఎవరూ స్పందించని వాళ్లు.. ఈ ఒక్క అంశాన్నే ఎందుకు తప్పుపడుతున్నారని నిలదీశారు.

వీధి కుక్కలను నిర్మూలించడానికి తీసుకుంటోన్న చర్యలను ఖండించారు. వీటిని హత్యలుగా అభివర్ణించారు. వాటిని నిర్మూలించడానికి చేపట్టిన చర్యలు అత్యంత అన్యాయమైనవని, మానవత్వం లేనివని అన్నారు. చిన్నపిల్లలను కరుస్తున్నాయనే కారణంతో వీధి కుక్కల పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రజా భద్రత పేరుతో జంతువులను లక్ష్యంగా చేసుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కుక్కలను నిందించడం పట్ల రేణు దేశాయ్ అభ్యంతరం తెలిపారు.

Renu Desai Questions Targeting Dogs for Public Safety Failures

సమస్య పరిష్కారంతో వీధి కుక్కలను నిర్మూలించడం సరికాదని ఆమె తేల్చి చెప్పారు. తమ చుట్టు పక్కల ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణం పోతుందని తెలిసినా ఎవరూ దాన్ని అనుసరించట్లేదని, అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తోన్నాయని రేణుదేశాయ్ అన్నారు. మానవ ప్రాణ నష్టం పలు కారణాల వల్ల జరుగుతున్నా, అలాంటి సందర్భాలలో తీవ్ర చర్యలు ఉండవని, కుక్కుల కరుస్తోన్నాయనే ఉద్దేశంతో వాటిని నిర్మూలించడం అమానుషమని పేర్కొన్నారు.

కొన్ని కుక్కలు జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయనే కారణంతో అన్నిటినీ శిక్షించడం మానవత్వం అనిపించుకోదని స్పష్టం చేశారు. దోమల నివారణం ఏం చర్యలు తీసుకున్నారని రేణు దేశాయ్ ప్రశ్నించారు. డెంగ్యూతో చిన్నపిల్లలు చనిపోతున్నారని, వాటిని అరికట్టగలిగారా? అని నిలదీశారు. ప్రాణాంతకంగా ప్రవర్తించే కుక్కలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయని, వాటిని మాత్రమే పరిష్కరించాలి తప్ప సామూహిక హత్యలకు దిగొద్దని అన్నారు.

హైదరాబాద్‌ చుట్టూ వందలాది స్టెరిలైజ్డ్ కుక్కలను సరైన కారణాలు లేకుండానే చంపేశారని రేణు దేశాయ్ ఆరోపించారు. ప్రమాదకరమైన కుక్కలను గుర్తిస్తే వాటిని జంతు సంక్షేమ సంస్థలకు బాధ్యత వహిస్తాయని తెలిపారు. కుక్కల గురించి మాట్లాడేవారు మద్యం దుర్వినియోగం, గృహ హింస, రహదారి భద్రత వంటి తీవ్ర సామాజిక సమస్యలపై ఎందుకు గళమెత్తరని ఆమె ప్రశ్నించారు. ఆమె వాదనలను జంతు ప్రేమికులు సమర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+