రిపబ్లిక్ టీవీ మెట్రిజ్ తెలంగాణ ఎగ్జిట్ పోల్: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్‌దే పైచేయి

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. దీంతో వివిధ మీడియా, పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. పలు సంస్థలు అధికార్ బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని వెల్లడించగా.. మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని పేర్కొన్నాయి. ఇంకొన్ని సంస్థలు ఎవరికీ పూర్తి మెజార్టీని ఇవ్వలేకపోయాయి.

Recommended Video

    Congress హస్తం హవా..KCR కారుకు షాక్.. Telangana Election Results | Exit Polls | Telugu oneindia

    రిపబ్లిక్ టీవీ-మాట్రిజ్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అధికార బీఆర్ఎస్ పార్టీకి 46-56 సీట్లు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 58-68 స్థానాల్లో విజయం లభిస్తుందని అంచనా వేసింది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీకి 4-9 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చింది. ఏఐఎంఐఎం పార్టీకి 5-7 సీట్లు వచ్చే అవకాశ ఉందని పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని వెల్లడించింది.

     Republic TV-Matrize Telangana exit poll: Congress secures highest seats than BRS

    అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలతో పోల్చితే డిసెంబర్ 3న వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయని అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంటున్నారు. తాజాగా, మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవమయ్యే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎవరూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

    ఈరకమైన ఎగ్జిట్‌ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమీ కాదు. డిసెంబర్‌ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది.' అని మంత్రి కేటీఆర్‌ తేల్చేశారు.

    ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడటమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్‌ 3న ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించిన మీడియా సంస్థలను ప్రశ్నించారు. ఎవ్వరూ కన్ఫ్యూజన్‌ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+