Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త.. వారికి లక్ష రూపాయల విలువైన బైక్ ఉచితంగా ఇస్తున్న సీఎం రేవంత్!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోంది. మధ్యతరగతి, నిరుపేద వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అందించి ప్రజలలో మద్దతు పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మైనారిటీల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మైనారిటీల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని కోసం నిధులను కూడా కేటాయించింది.

రేవంత్ అన్న కా సహారా పథకం
రేవంత్ అన్న కా సహారా పేరుతో తీసుకువచ్చిన పథకంలో అర్హత కలిగిన మైనారిటీ లబ్ధిదారులకు మోపెడ్ లు, బైకులు, ఈ బైకులు ఇచ్చి వారికి అండగా నిలవనుంది. ఈ పథకంలో మైనారిటీ లబ్ధిదారులకు ఒకేసారి గ్రాంట్ ద్వారా ఆర్థిక సహాయం బైక్ రూపంలో అందించనుంది. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు విలువైన బైక్ లను ఉచితంగా అందించనుంది.

Revanth govt Good news one lakh rupees bike free for minoriteis in revanth anna ka sahara scheme

Take a Poll

మైనారిటీలు OBMMS ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు
ఈ పథకంలో లబ్ధి పొందాలని భావించే మైనారిటీలు OBMMS ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటి నుంచి అప్లికేషన్లను తీసుకుంటుండగా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ముగింపు తేది వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఉంది. ఈ పథకంలో లబ్ధి పొందాలనుకుంటే దరఖాస్తుదారులు కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకోవటానికి కావాల్సింది ఇవే
ముఖ్యంగా దరఖాస్తుదారులు ఫకీర్, దూదేకుల, దుర్బల ముస్లిం సమాజానికి చెందిన వారై ఉండాలి. వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో అయితే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలుగా ఉండాలి. చిరునామా రుజువుగా దరఖాస్తుదారుని ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జతపరచాలి.

దరఖాస్తుకు వీరు అనర్హులు
దరఖాస్తుదారుడు వయసు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. దరఖాస్తుదారుడు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. ఇక బైక్, మోపెడ్, లేదా ఈ బైక్ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వబడుతుంది. అంతేకాదు గతంలో ఐదు సంవత్సరాలుగా మైనారిటీ కార్పొరేషన్ లేదా ప్రభుత్వం నుండి సబ్సిడీని పొందిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

ఉచితంగా లక్ష రూపాయల విలువైన బైక్
ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం ద్వారా వారు లక్ష రూపాయల విలువైన బైక్ ను ఫ్రీగా పొందవచ్చు. ఇది వీరి జీవన ప్రమాణం మెరుగుదలకు దోహదం చేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రేవంత్ అన్న కా సహారా పేరుతో ఈ పథకాన్ని అందిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+