వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌కు చుక్కెదురు, 'రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని ఎసిబి వేధిస్తోంది'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు సోమవారం ఉదయం ఎసిబి న్యాయస్థానంలో హాజరయ్యారు. అనంతరం విచారణ 14వ తేదీకి వాయిదా పడింది.

కోర్టులో ఉదయ్ సిన్హా ఫిర్యాదు

ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయ్ సిన్హా న్యాయస్థానంలో ఎసిబి అధికారుల పైన ఫిర్యాదు చేశారు. కేసులో రాజకీయ నేతలకు ప్రమేయముందని చెప్పమని ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని, తన పైన ఒత్తిడి తెస్తున్నారని ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఉదయ్ సిన్హా జడ్జికి ఫిర్యాదు చేశారు.

Revanth Reddy

విచారణ పేరిట తనను వేధింపులకు గురి చేసిన ఏసీబీ అధికారులు, తాము చెప్పినట్లు వినాలని కూడా బెదిరిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఏసీబీ అధికారుల వేధింపుల నుంచి తనకు విముక్తి కల్పించాలని జడ్జిని కోరారు. మరోవైపు ఎసిబి మెమో దాఖలు చేసింది.

రేవంత్ రెడ్డికి లభించని ఊరట

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట లభించలేదు. తనకు బెయిల్ షరతులు సడలించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. షరతుల సడలింపుకు న్యాయస్థానం నిరాకరించింది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న
తాను హైదరాబాదులో ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ కోరారు. అయితే, చుక్కెదురయింది.

మరోవైపు, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరి బెయిల్ షరతులను కోర్టు కొంతమేర సడలించింది. ప్రతిరోజు కాకుండా, వారంలో సోమవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ఏసీబీ అధికారుల ఎదుట హాజరకావాలని ఏసీబీ కోర్టు తెలిపింది.

English summary
Telangana Telugudesam Party MLA Revanth Reddy appeared before ACB court on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X