చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అదిరిపోయే షాక్!!

విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి తెలంగాణా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణాకు పెట్టుబడులు.. రేవంత్ హర్షం
అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చామన్న ఆయన , మెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని ప్రకటించారు.

Revanth Reddy comments on investments shocked Chandrababu we are not compete with ap

తెలంగాణా పారిశ్రామికాభివృద్ధికి ప్లాన్
పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం రేవంత్. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి..మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్..రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ.
అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.

మా పోటీ ఏపీతో కాదు ప్రపంచంతో
వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం అన్న రేవంత్ మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు... మా పోటీ ప్రపంచంతో అన్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదు.. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదన్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవన్నారు రేవంత్ రెడ్డి.

ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం..మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందని తెలిపారు.ఇక కాగ్నిజెంట్ ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కాగ్నిజెంట్‌ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+