రైతు రుణమాఫీ చేస్తాం.. పార్టీని రద్దు చేస్తారా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్

మాజీమంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడని, సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని పేర్కొన్న రేవంత్ రెడ్డి పంద్రాగస్టులోగా రైతుల రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? అని సవాల్ విసిరారు. ఈ సవాల్ కు హరీష్ సిద్ధమా? అని ప్రశ్నించి, నేను మాటిస్తే ఎలా ఉంటుందో మీ మామను అడుగు అంటూ పేర్కొన్నారు.

కొడంగల్ లో కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ మాజీ మంత్రుల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుందన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మదన్నారు.

Revanth Reddy counter-challenge to Harish rao on loan waiver

బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారు
చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్ కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. కొడంగల్ ప్రజలు కథానాయకులై నన్ను 33వేల మెజారిటీతో గెలిపించారన్నారు. కొడంగల్ ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కొడంగల్ ప్రజలపై ఉందన్నారు.

తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
ఆనాడు నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్నది డీకే అరుణ అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి అలాంటి డీకే అరుణ ఇవాళ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. 3900 కోట్ల లోటు బడ్జెట్ తో నేను సీఎం గా బాధ్యత తీసుకున్నానన్నారు. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టానని, అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తానన్నారు.

బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నామన్నారు. త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+