రేషన్ కార్డుల విషయంలో అడకత్తెరలో పోకచెక్కలా రేవంత్ రెడ్డి పరిస్థితి!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులపైన దృష్టి సారించింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో డిసెంబర్ 28 నుంచి కొత్త కార్డులను జారీ చేయాలని భావిస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన నిబంధనలను కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? రేవంత్ రెడ్డి ఈ నిర్ణయంతో ఇబ్బందిని ఎదుర్కొంటారా? అన్నది ఆసక్తికర అంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ మొత్తం రేషన్ కార్డులను రద్దు చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ.

 Revanth Reddy decision regarding ration cards, here are the consequences!!

రేషన్ కార్డులను రద్దు చేసి మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ మొత్తం రేషన్ కార్డులు రద్దు చేయకుంటే, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి నిబంధనలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నిబంధనలలో 100 గజాల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వకుండా అనర్హులుగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఒకవేళ ఇదే కనుక అమలు జరిగితే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న చాలామంది అర్హతను కోల్పోతారు. ఇది కూడా రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలంటే రేషన్ కార్డు ఉన్నవాళ్లను అర్హులను చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రేషన్ కార్డుల ప్రక్షాళన చేస్తే, ఆ ఆ సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం.

అయితే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవాళ్లు తమ రేషన్ కార్డులను కోల్పోతే కచ్చితంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ఆశిస్తున్న వారికి రేషన్ కార్డు ఇవ్వకుంటే వారు కూడా తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశం ఉంది. అలాకాకుండా ఇప్పటికే ఉన్న కార్డులను అలాగే ఉంచి, కొత్తకార్డులను కూడా మంజూరు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీలు అమలు కష్టంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది.

ప్రభుత్వంపై భయంకరమైన ఆర్ధిక భారం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల పర్యవసానం ఏ విధంగా ఉంటుంది? ఆయన చర్యలను ప్రజలు మెచ్చుకుంటారా లేదా తిట్టుకుంటారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+