వాహనదారులకు బంపర్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!
చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్టిఏ కార్యాలయం చుట్టూ తిరగడం, దళారుల చుట్టూ తిరగడం చేస్తూ ఉంటారు .అయితే ఇప్పుడు ఆ బాధ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవడానికి ఒక మంచి వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
మొబైల్ నుండే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తు
ఇకపై ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలి అనుకుంటే ఆర్టిఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ లోని రవాణా శాఖ వెబ్సైట్లోకి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ సౌకర్యంతో వాహనదారులకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఇక వెబ్ సైట్ లో ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే..

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు ఇలా అప్లై చేసుకోవాలి
రవాణా శాఖ వెబ్సైట్లోకి వెళ్లి అందులోని లైసెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ను ఎంచుకుంటే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కింద ఉన్న రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ పై క్లిక్ చేస్తే ఆ తర్వాత క్లిక్ హియర్ టు బుక్ థిస్ స్లాట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది.
స్లాట్ బుక్ చేసుకోవటానికి ప్రాసెస్ ఇలా
ఆప్షన్ ను ఎంచుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం మనం స్లాట్ బుక్ చేసుకోవటానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక అదే పేజీలో కింద వచ్చిన బాక్స్ లో మనం డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ను, ఆ లైసెన్స్ ను ఎక్కడ తీసుకున్నాం, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను నింపి తరువాత రిక్వెస్ట్ ఓటిపి పైన క్లిక్ చేస్తే, మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.
ఆన్ లైన్ లోనే పేమెంట్
ఆ ఓటిపిని క్యాప్చా ను ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని నొక్కితే మనం ఇచ్చిన వివరాలు అక్కడ కనిపిస్తాయి. ఒకసారి చూసుకున్న తర్వాత అన్ని సరిగా ఉంటే కన్ఫామ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది.ఎప్పుడైతే మనం కన్ఫామ్ చేస్తామో అప్పుడు వేరొక విండోలో మనకు తేదీలు కనిపిస్తాయి. ఆ కనిపించే తేదీలలో మనకు వీలున్న తేదీని ఎంచుకొని, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజును పేమెంట్ చేయాలి.
ఆర్టీఏ ఆఫీస్ కు రెన్యువల్ నాడే
పేమెంట్ పూర్తి చేసిన తర్వాత స్లాట్ బుక్ అవుతుంది. ఇక దానిని ప్రింట్ తీసుకుని, ఒరిజినల్ లైసెన్స్ గుర్తింపు కార్డుతో ఆర్టిఏ ఆఫీస్ కు మనం పెట్టుకున్న తేదీని బట్టి భౌతికంగా హాజరు కావాలి. అప్పుడు వారు అక్కడ అన్ని చెక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేస్తారు. కేవలం రెన్యువల్ చేసే రోజు మాత్రమే మనం ఆర్టిఏ ఆఫీస్ కి వెళ్తే సరిపోతుంది.
సింపుల్ గా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్
మిగతా పని అంతా మనం సింపుల్ గా మొబైల్ ఫోన్లో చేసేసుకోవచ్చు. ఇక ఈ వెసులుబాటును కల్పించడం వల్ల ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకునే అవకాశం కలుగుతుంది.












Click it and Unblock the Notifications