బండ్లన్న డాన్స్ ఇరగదీసిండు..!!

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు.

Revanth Reddy Oath taking: Tollywood producer Bandla Ganesh dance with Congress workers

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో- హైదరాబాద్‌లో పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌ను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. రేవంత్ రెడ్డిని అభినందిస్తూ జంట నగరాల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

ప్రమాణ స్వీకారానికి వేదికగా మారిన ఎల్బీ స్టేడియానికి దారి తీసే మార్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డిలకు సంబంధించిన భారీ కటౌట్లను నెలకొల్పారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

Revanth Reddy Oath taking: Tollywood producer Bandla Ganesh dance with Congress workers

కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలను నిర్వహించారు. భారీ ప్రదర్శనను చేపట్టారు. ర్యాలీగా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటోన్నారు. కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ నిర్మాత-నటుడు బండ్ల గణేష్ ఈ విజయోత్సవ ర్యాలీల్లో స్టెప్పులేశారు. డాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+