ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడేశాడు.. రాజకీయమైనా మైదానమైనా తగ్గేదే లేదంటున్న రేవంత్
మల్కాజ్ గిరి ఎంపీ , కేసీఆర్ పై మీసం మెలేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా తన సత్తా చాటుతా అంటున్నారు. తాజాగా మైదానంలో కూడా ఆటాడేస్తూ తన బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మైదానంలో ఫుట్ బాల్ క్రీడాకారులతో కలిసి చెడుగుడు ఆడుకున్నాడు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు క్రీడా మైదానంలో ఫుట్ బాల్ క్రీడాకారులతో కూడా ఒకాట ఆడి వారితోనే అబ్బా అనిపించాడు .

స్టేడియంలో ఫుడ్ బాల్ ఆడుతూ క్రీడాస్పూర్తిని చాటిన ఎంపీ రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి .. పెద్దగా పరిచయం అక్కరలేని రాజకీయ నాయకుడు. సూటిగా, సుత్తి లేకుండా , ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా మాట్లాడగల సమర్ధుడు . ఎప్పుడు ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి,ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నా అంటూ ప్రశ్నించే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు మాత్రం కొరకరాని కొయ్య . రాజకీయాల్లో పడినా , లేచినా సరే దూకుడు ఏ మాత్రం తగ్గకుండా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి తాజాగా స్టేడియంలో ఫుడ్ బాల్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. . రాజకీయంగా మల్కాజ్ గిరి ఎంపీగా గోల్ కొట్టిన రేవంత్.. ఇటు మైదానంలో కూడా ఆటగాళ్ళతో ఫుట్ బాల్ ఆడి గోల్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
రాజకీయాల్లోనే కాదు .. మైదానంలోనూ ఆటాడుకున్న రేవంత్ రెడ్డి
తాజాగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో క్రీడాకారులకు మెరుగైన వసతులు తదితర ఏర్పాట్ల గురించి పరిశీలించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డి క్రీడాకారులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. ఏదో అందరి ముందు బాల్ ను పట్టుకొని , కాలితో తన్ని ఫోటోలకు పోజులు ఇచ్చినట్టు కాకుండా ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ అవతారం ఎత్తారు. డ్రెస్ మార్చి క్రీడాకారులతో తలపడ్డారు. గోల్ కూడా చేశారు. మైదానాల్లో వసతుల కల్పనపై క్రీడాకారులను తెలుసుకోవడానికి వెళ్లిన రేవంత్ సరదాగా ఆటవిడుపుగా వారితో కలిసి ఫుట్ బాల్ ఆడాడు. మైదానంలోకి బంతితో దూసుకెళ్లిన రేవంత్ రెడ్డి ఒక గోల్ కొట్టగా.. మరొకటి కొంచెంలో మిస్ అయ్యింది . ఏది ఏమైనా మైదానంలో ఇంత చురుగ్గా ఆటగాళ్లతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడిన వైనం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర అంశంగా మారుతుంది .
ఫ్యాన్స్ ఫిదా .. టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే గులాబీ దళాన్ని ఫుట్ బాల్ ఆడతారంటున్న ఫ్యాన్స్
రేవంత్ ఫుట్ బాల్ ఆడిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ రేవంత్ ఎక్కడ ఉన్నా ఫైర్ బ్రాండే అని కితాబిస్తున్నారు. రాజకీయ రంగం అయినా, క్రీదామైదానం అయినా ఆటాడుకోవటం రేవంత్ నైజం అని తెగ సంబరపడుతున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్ కు అవకాశం ఇస్తే ఇదే తరహా ఆట తీరు కనబరుస్తారని , సీఎం కేసీఆర్ కు, గులాబీ దళానికి చెమటలు పట్టిస్తారని , చుక్కలు చోఒపిస్థారని లెక్కలు వేస్తున్నారు రేవంత్ అభిమానులు .
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications