అర్ధరాత్రి నడీరోడ్డుపై రెచ్చిపోయిన రౌడీ షీటర్లు: బట్టలు చించుకొని దాడులు
హైదరాబాద్ నగర శివార్లలో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రాత్రి గోల్కొండ ఎంజీ లైన్స్ సమీపంలో రెండు వర్గాలు విడిపోయిన రౌడీ షీటర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
హైదరాబాద్: నగర శివార్లలో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రాత్రి గోల్కొండ ఎంజీ లైన్స్ సమీపంలో రెండు వర్గాలు విడిపోయిన రౌడీ షీటర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఓ రౌడీ షీటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అదిల్, ఫైజల్, మరో రౌడీ షీటర్‌తో కలిసి అఫ్జల్ అనే మరో రౌడీ షీటర్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బట్టలు చిరిగిపోయాయి. అటుగా వెళుతున్న వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

నడిరోడ్డుపై ఈ ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. కొద్ది సేపటి తర్వాత రెండు వర్గాలు అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దృష్టిసారించినట్లు తెలిసింది.
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
గంజాయి స్మగ్లింగ్ ముఠాలపై ఎక్సైజ్ పోలీసులు కొనసాగిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో బుధవారం మరో ఇద్దరు పేరుమోసిన గంజాయి స్మగ్లర్లు చిక్కారు. వీరిలో ఒకరు అప్పర్ ధూల్‌పేటకు చెందిన బ్రిజ్‌మోహన్‌సింగ్(62) కాగా మరొకరు గండిహనుమాన్ ప్రాంతానికి చెందిన అజయ్‌సింగ్(26)లు ఉన్నారు.
వీరిద్దరూ కల్సి రాజ్‌కుమార్‌సింగ్ అలియాస్ కాలూ అలియాస్ రౌడీ కాలూ అనే మరో పెద్ద గంజాయి స్మగ్లర్ నుంచి గంజాయిని సేకరించి జంటనగరాల వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సైజ్ శాఖ హైదరాబాద్ ఏఈఎస్ ఎన్.అంజిరెడ్డి తెలిపారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications