రూ. 10 నాణేలు చెలామణిలోనే ఉన్నాయ్!
గత కొంత కాలంగా 10 రూపాయల నాణేలు చెల్లడం లేదంటూ కొందరు వ్యాపారులు తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు కూడా ఎవరైనా రూ. 10 నాణేలు ఇస్తే తీసుకోవడం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రూ. 10 నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
రూ. 10 నాణేలు చట్టబద్ధవైనవేనని.. వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని తెలిపారు. వీటి చలాహమణిని వ్యాపార లావాదేవీలకు వినియోగించాలనే ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు ధారాసింగ్ తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని బ్యాంక్ శాఖ వద్ద రూ. 10 నాణేల చలామణిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధారా సింగ్ మాట్లాడుతూ.. తమ ఖాతాదారులకు పది రూపాయల నానేలు వినియోగించుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ నాణేలు చెల్లుబాటు అవుతున్నాయన్నారు.ప్రజల్లో రూ. 10 నాణేలపై ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ నాణేలను లావాదేవీలకు చలామణి చేయవచ్చని, రూ. 10 నోటు కంటే నాణేం ఎక్కువ కాలం మన్నికతో ఉంటుందని జనరల్ మేనేజర్ ధారా సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులకు రూ. 10 నాణేలను అందజేశారు.












Click it and Unblock the Notifications