హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల భారీ మోసం: లబోదిబోమంటున్న బాధితులు
హైదరాబాద్ నగరంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని ఓ సంస్థ పెద్ద మొత్తంలో డబ్బును కాజేసింది. అధిక వడ్డీకి ఆశపడిన ప్రజల నుంచి ఏకంగా రూ. 700 కోట్లు వసూలు చేసిన డీకేజడ్ టెక్నాలజీస్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో మోసం పోయామంటూ బాధితులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లబోదిబో మంటున్నారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ డీకేజీడ్ టెక్సాలజీస్ సంస్థ ప్రజల నుంచి డబ్బులను సేకరించింది. మాదాపూర్‌లోని ఈ సంస్థ మొత్తం రూ. 700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 18వేల మంది బాధితులు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. అధిక వడ్డీలు చెల్లిస్తామని డబ్బులు సేకరించిన తమను మోసం చేసిందని బాధితులు వాపోయారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ఎదుట బాధితులంతా ఆందోళన చేపట్టారు. ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కాగా, మొత్తం 3 రాష్ట్రాల్లో 55 వేల మందికిపైగా బాధితులు ఉన్నట్లు తెలిసింది. ఈ సంస్థ ముందు ఇన్వెస్టర్లను నమ్మించేందుకు తొలుత లాభాలు చూపించింది. పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్ని నెలలపాటు ఇన్వెస్టర్ల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది.
చివరకు రూ. 700 కోట్లతో డీకేజడ్ సంస్థ ఉడాయించింది. అయితే, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రమోషన్లు చేయించి మోసానికి పాల్పడ్డారు. లాభాలు వస్తుండటంతో.. పలువురు అప్పులు చేసి, మరికొందరు బంగారం అమ్మి పెట్టుబడి పెట్టారు. తాము ఉన్నదంతా పోగొట్టుకున్నామని బాధితులు వాపోతున్నారు. నిందితులు మాజీ మంత్రి మహమూద్ అలీ ఫొటోను కూడా వాడుకున్నట్లు సమాచారం.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications