నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్త.. త్వరలో మళ్ళీ జాబ్స్!
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో నిరుద్యోగులకు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు .పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, నష్టాలలో ఉన్న ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ఆర్టీసీ సమస్యలపై మాట్లాడి, శుభవార్త చెప్పిన మంత్రి
ఆరాంఘర్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ, పోలీసు శాఖల భూ బదలాయింపుపైన చర్చించాలన్నారు. నగరంలో కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి, జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అలాగే త్వరలో నిరుద్యోగులకు సంబంధించి ఒక శుభవార్త చెప్పిన ఆయన వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.

జాబ్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తామన్న ఆర్టీసీ
ఇప్పటికే ఆర్టీసీలో 1000 డ్రైవర్లు, 743 మంది శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలోనే ఈ పరీక్షలను కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తికాగా పరీక్షలకు సమాయత్తమవుతున్నారు. ఇక ఇదే సమయంలో ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో మరో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.
ఈ పోస్టులను భర్తీ చేస్తామన్న ఆర్టీసీ
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టీసీలో 114 సూపర్వైజర్ ట్రైనీ, 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. టి జి పి ఎస్ సి లేదా పోలీసు బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వివరించారు . ఇక కారుణ్య నియామకాల కింద చేరిన కండక్టర్లకు ఉన్న మూడేళ్ల ప్రొవిజన్ ను రెండేళ్లకు తగ్గించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వారితో జూమ్ సమావేశం లో మాట్లాడతా అన్న మంత్రి
అంతేకాదు బస్సు ప్రమాదాలను తగ్గించడానికి మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టు ఫోర్త్ సిటీ లో బస్సు టెర్మినల్ ఏర్పాటు, బస్సు సౌకర్యాలపై అధ్యయనం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications