గ్రేటర్ ఓటర్ల జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో పలు తప్పులు చోటు చేసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఓటు హక్కు కల్పించారు.
పాతబస్తీ గౌలిపుర డివిజన్లోని ఓటర్ల జాబితాలో సల్మాన్ ఖాన్ పేరు కూడా ఉంది. ఓటరు పేరు సల్మాన్‌ఖాన్, తండ్రిపేరు సలీంఖాన్గా పేర్కొంటూ సల్మాన్ ఫొటోతో జాబితాలో ఓటు ఉంది. దీనిలో సల్మాన్ వయస్సు 64గా పేర్కొన్నారు.

సల్మాన్ ఖాన్ ముంబైలో నివాసముంటున్న విషయం తెలిసిందే. కాగా, అధికారుల నిర్లక్ష్యం వల్లనే జాబితాలో ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురు వీఐపీల పేర్లు వివిధ ప్రాంతాల్లో నమోదైన విషయం తెలిసిందే.
కాగా, గ్రేటర్ పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ప్రభుత్వం మంగళవారం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ నగర ప్రజలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పటి వరకు 35శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం












Click it and Unblock the Notifications