అదేం లేదు! ‘సమంత మా బ్రాండ్ అంబాసిడరే’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీనటి సమం త సేవలను వినియోగించుకుంటామని, ఇందుకు సంబంధించి త్వరలోనే ఆమెతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంటామని టెస్కో డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ స్పష్టం చేశారు. చేనేత వస్త్రా‌లకు సమంత బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదంటూ వచ్చిన వార్తలపై స్పందించిన డైరెక్టర్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నిజమే! 'సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు'

చేనేతరంగం అభివృద్ధికి, చేనే త వస్త్రా‌లపై ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన సమంతను మంత్రి కేటీఆర్‌ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తించి గౌరవించారని తెలిపారు. ఆమె సేవలను సంతోషంగా వినియోగించుకుంటామని చెప్పారు.

 Samantha to endorse handloom products

చేనేత వస్త్రా‌లంటే తనకు ఇష్టమని, అందుకే టెస్కోతో కలిసి స్వచ్ఛందంగా చేనేత వస్త్రా‌లకు ప్రాచుర్యం కల్పిస్తానని సమంత చెప్పారన్నారు. ఈ కారణంగానే ఆమెను బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తించినట్లు తెలిపారు. దీనికనుగుణంగానే సమంత ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

పలు చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను, ప్రాంతాలను కూడా సందర్శించారని తెలిపారు. కాగా, సమంతను చేనేత రాయబారిగా నియమించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు చిక్కా దేవదాసు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు చేనేత, జౌళి శాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Film actor Samantha will continue as brand ambassador for handloom products, said Tesco Director, Shailaja Ramaiyer here on Wednesday.
Please Wait while comments are loading...