• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Liquor Case: లిక్కర్ కేసులో కీలక మలుపు.. అరబిందో ఫార్మా లిమిటెడ్ అధినేత శరత్ రెడ్డి అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 మనీలాండరింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా లిమిటెడ్ అధినేత శరత్ రెడ్డి కాగా, మరో వ్యక్తి వినయ్ బాబు పెర్నోడ్ రికార్డ్ లిక్కర్ కంపెనీ అధికారి. వినయ్ బాబు పెర్నాడ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన అధికారులు.. రెండు రోజుల నుంచి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్నారు.

శరత్, వినయ్ బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉన్నట్లు అధికారులు తెలిసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రాష్ట్రానికి చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో సిసోడియాను సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో నంబర్‌వన్‌గా పేర్కొంది. IPC సెక్షన్‌లు 120-B (నేరపూరిత కుట్ర), 477-A (ఖాతాల తప్పుడు సమాచారం) కింద సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

Sarath Reddy, head of Aurobindo Pharma Limited, arrested in ED liquor scam.

కాగా ఇటు హైదరాబాద్, కరీంనగర్ లో ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు చేస్తోంది. హైదరాబాద్ శ్రీనగర్ లోని టీఆర్ఎస్ రాజ్యసభ వద్దిరాజ్ రవిచంద్ర కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 11 గంటలుగా సొదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా ఈడీ, ఐటీ సంయుక్తంగా సోదాలు చేశాయి. కరీంనగర్, హైదరాబాద్ లో ఏకాలంలో ఈ సోదాలు చేశారు. గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సోదాలు చేశారు. పంజాగుట్టలోని శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఈడీ సంయుక్తంగా సోదాలు చేశారు.

English summary
Two more arrested in Delhi liquor scam. Sarath Reddy, head of Darabad-based Aurobindo Pharma Limited, was among those arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X