బెస్ట్ ప్లేస్.. బోటు షికారు హైలెట్.. హైదరాబాద్ కు 90 కి. మీ. దూరంలోనే..

నగర వాసులు వీకెండ్ వస్తే ఈ ప్రదేశానికి క్యూ కడుతున్నారు. హైదరాబాద్ కు కేవలం 90 కి. మీ. దూరంలోనే ఉండటంతో ఉదయం బయల్దేరినా సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. బెస్ట్ 1 డే ట్రిప్ గా పర్యటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి లేక్ అందాలు చూపరులను మైమరపింపజేస్తాయి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అందుకే ఈ ప్రదేశానికి పిల్లలు, మహిళలతో నిత్యం అనేక మంది వస్తుంటారు. హైదరాబాద్, వికారాబాద్ వాసులకు ఇదో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది.

వికారాబాద్ జిల్లా సర్పన్ పల్లి లేక్.. వికారాబాద్ నుంచి 10 కి. మీ. దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి 90 కి. మీ. దూరంలో ఉంటుంది. వీకెండ్స్ లో నగరవాసులు ఇక్కడికి అధికంగా వస్తుంటారు. ఇక్కడి సరస్సు అందాలు.. ప్రశాంతమైన వాతావారణం.. పచ్చని పొలాలు, చెట్లు, కొండలు.. పర్యటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే సాయంత్రం సమయంలో సన్ సెట్.. పొద్దుపొద్దున్నే సన్ రైజ్ అందాలను చూసేందుకు భారీగా దంపతులు, లవర్స్, ఫ్యామిలీస్ వస్తుంటారు. కాసేపు ఇక్కడ సరదాగా గడిపేస్తుంటారు. హైదరాబాద్ నుంచి దగ్గరే కావడంతో వీకెండ్స్ లో ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు.

Sarpanpally Serenity Vikarabad s Hidden Lake View Point Beckons with Untouched Tranquility

అలాగే సర్పన్ పల్లి లేక్ లో బోటు షికారు కూడా ఉంది. హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో బోటులో సరస్సుపై ప్రయాణం చేయవచ్చు. మీకే ఓ చిన్న బోటు ఇస్తారు. తెడ్లతో మీరే సరదాగా పడవను నడుపుకొంటూ వెళ్లొచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదుపాయం ఉంటుంది. బోటు షికారులో పాల్గొనే వారికి భద్రత కోసం లైఫ్ జాకెట్ అందిస్తారు. ఇక బోటు షికారు ఒక్కరికి 30 నిమిషాలకు రూ. 500 కాగా ఇద్దరు అయితే 30 నిమిషాలకు రూ. 800 గా ఉంది. నగరవాసులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+