అల్లు అర్జున్ కు కొత్త కష్టం!
పుష్ప 2 సినిమా రోజున సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్క అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే మరోవైపు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ పైన సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనతో వచ్చిన వ్యతిరేకతను పోగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
అల్లు అర్జున్ పై మరో పిడుగు
ఇక ఇదే సమయంలో అల్లు అర్జున్ పైన మరొక పిడుగు పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను ప్రజలు వదిలిపెట్టడం లేదు. తాజాగా సంధ్యా థియేటర్ ఘటన పైన సెటైరికల్ సాంగ్ వైరల్ గా మారింది. టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్ తో వచ్చిన ఒక సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

మేమే సావాలి.. సంపాదన మీదే కావాలి
డిసెంబర్ 27వ తేదీన మసాలా బ్యాండ్ అనే యూట్యూబ్ ఛానల్ జానపద శైలిలో సాగే ఒక మ్యూజికల్ వీడియోను విడుదల చేసింది. ఈ పాటలో సావులు మేమే సావాలి.. సంపాదన మీదే కావాలి అంటూ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. పైసా తోనే ప్రాణం కొంటారా పెద్దమనుషులు.. మీవల్లే సచ్చిన మనిషిని.. చూడరావు మీ మనసులు అంటూ పాటలో పేర్కొన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్
— Swathi Reddy (@Swathireddytdp) December 29, 2024
టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో సాంగ్
Credits: Masala Band pic.twitter.com/U6TuqQDxJO
అల్లు అర్జున్ టార్గెట్ గా సెటైరికల్ సాంగ్
ఆ పాటలో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని మేనరిజం చూపిస్తూ చేసిన డాన్స్ చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ పేరు కానీ, పుష్ప ప్రస్తావన కానీ ఎక్కడా పాటలో తీసుకురాకుండా రేవతి మృతి విషయంలో అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని టార్గెట్ చేసినట్టుగా ఈ సెటైరికల్ సాంగ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇవి మాత్రమే కాదు సెల్ఫీకోసం వస్తే చెంప పగలగొడతారని, కటౌట్లు కట్టి మా ప్రాణాలు పోయాయని పాటలో పేర్కొన్నారు.
సంధ్యా థియేటర్ ఘటనపై సాంగ్ .. భిన్నాభిప్రాయాలు
సినిమా వాళ్ళకోసం సామాన్యులు చేస్తున్న త్యాగాలను, వాళ్లను సినిమావాళ్లు ట్రీట్ చేస్తున్న విధానాన్ని ఎత్తిచూపారు. అయితే కొంతమంది ఈ పాటను ఆసక్తిగా చూసి నిజమేనని చర్చించుకుంటే, మరి కొంతమంది రేవతి మరణం ఒక సెన్సిటివ్ ఇష్యూ అని దాని మీద పాటలు చేయడం ఆమోదయోగ్యం కాదని సాంగ్ పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పాట ద్వారా మరోసారి అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు మసాలా బ్యాండ్ నిర్వాహకులు.












Click it and Unblock the Notifications