Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మున్సిపల్ ఎన్నికల వేళ ఊహించని నిర్ణయం, కీలక మలుపు..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచాయితీ ఎన్నికలు పూర్తి కావటంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది. సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలు ఖరారయ్యాయి. అధికార కాంగ్రెస్ మున్సిపల్ పోరు వ్యూహం సిద్దం చేసింది. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం ఈ ఎన్నికలకు సై అంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్.. ఎన్నికల తేదీల పై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సెమీ ఫైనల్స్ గా మారుతున్నాయి.

తెలంగాణలో సిసలైన రాజకీయ సమరం మొదలైంది. ప్రధాన పార్టీల పై పబ్లిక్ పల్స్ ఏంటో స్పష్టత వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి.

SEC chances to release Schedule for municipal Elections on 17th of this month

ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా ఇదే నెల 21 లేదా 22 తేదీల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసి.. ఫిబ్రవరి 20వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈసారి బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే ఎస్‌ఈసీ ఎన్నికలకు వెళ్తున్నది. దీంతో, ఇప్పుడు ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

పంచాయితీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ - బీఆర్ఎస్ లో మున్సిపల్ పోరులో విజయం పైన ధీమా పెరిగింది. దీంతో, వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. విద్యార్థుల పరీక్షల సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రక్రియను ముగించాలని చూస్తున్నారు. అయితే, ఓటరు జాబితాలు తప్పుల తడకగా ఉన్నట్టు ఇప్పటికే అనేక జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక్కో కుటుంబం ఓట్లు వేర్వేరు చోట్ల ఉన్నట్టుగా ఆరోపణ లు వచ్చా యి.

ఈ నేపథ్యంలో ఈ నెల 10న పూర్తి కావాల్సిన తుది ఓటరు జాబితా ప్రకటన.. 12న ప్రచురించేలా అవకాశం కల్పించాలని ఇటీవల ఎస్‌ఈసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల ఎన్నికల అధికారులు కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలోని 6 మున్సిపల్‌ కార్పొరేషన్లలోని 366 వార్డులు, 117 మున్సిపాలిటీల పరిధిలోని 2,630 వార్డులకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రచురించాలని కమిషనర్‌ ఆదేశించారు. దీంతో, రాష్ట్రంలో ఈ నెల 17న మున్సిపల్ షెడ్యూల్ విడుదల అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+