సింహాలతో సింహంలా సీతక్క.. వీడియో వైరల్!
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క సింహాల సఫారీ చేశారు. ప్రస్తుతం సీతక్క సింహాల సవారీ వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల దక్షిణాఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఎల్ నినో ప్రభావంతో వచ్చే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అక్కడి ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేశారు.
ఈ పర్యటనలో సింహాల సఫారీ కూడా భాగమైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సౌతాఫ్రికా సఫారీ పార్కుల్లో సింహాలు కారు దగ్గరకు వచ్చి తిరగడం, కిటికీల దగ్గర నిలబడటం సాధారణంగా కనిపిస్తుంది. సీతక్క బృందం కూడా ఇలాంటి అనుభవాన్ని పొందినట్లు వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. సింహాలు నెమ్మదిగా కారు చుట్టూ తిరుగుతూ, కుతూహలంగా చూస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి .

ఇక సీతక్క సౌతాఫ్రికాలో సీతక్క సింహాల సఫారీ వీడియోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన మంత్రి సీతక్క ఈ పర్యటనలో భాగంగానే.. అక్కడి ప్రసిద్ధ వైల్డ్‌లైఫ్ సింహాల సఫారీలో పాల్గొన్నారు. సఫారీలో భాగంగా సీతక్క రెండు సింహాల వెనుక కర్ర పట్టుకుని నడుస్తూ సింహంలా కనిపించారు. ఈ వీడియో చూసి సీతక్క ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
సీతక్కకు ఉన్న యూనిక్ క్వాలిటీస్ ఈ పర్యటనలోనూ కనిపించాయి. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమంలో ఉండి, తర్వాత ప్రజా ఉద్యమాల్లోకి వచ్చారు. అడవులతో అనుబంధం ఉన్న సీతక్క, క్రూర మృగాలతోనూ మమేకం కాగలిగిన అడవి బిడ్డగా ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. చదువు, న్యాయవాద వృత్తి, పీహెచ్‌డీ చేసి రాజకీయాల్లో తనదైన భూమిక పోషించిన సీతక్క అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు కూడా చేస్తుంటారు.
కాగా సీతక్క సౌత్ ఆఫ్రికాలో బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సంస్కృతిని ప్రచారం చేశారు. వ్యవసాయ రంగంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులను నేర్చుకుని, తెలంగాణ రైతులకు అనువర్తింపజేయాలని భావిస్తున్నారు. సింహాల సఫారీ వీడియో మాత్రం మంత్రి సీతక్క సాహసాన్ని, ప్రకృతి పట్ల గౌరవాన్ని చూపించాయి.












Click it and Unblock the Notifications
