ఫ్రీగా కుట్టుమిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లు, మోటార్ బైక్, ఈ బైక్, ఈ స్కూటీలు.. త్వరపడండి
తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. 2026 - 27 సంవత్సరానికి గాను వివిధ స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్వయం ఉపాధి పథకాల ద్వారా క్రిస్టియన్ మైనారిటీస్ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయనుంది.
ఈ స్వయం ఉపాధి పథకం కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఇందులో భాగంగా కుట్టు మిషన్లు, చిన్న వ్యాపారాలు మరియు ఈ బైక్ మరియు ఈ స్కూటీ , మోటార్ బైక్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనారిటీల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబి ఎంఎంఎస్ పోర్టల్ ప్రారంభించి అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కుట్టు మిషన్ మరియు చిన్న వ్యాపారాలు చేసే వారి వయసు పరిమితి
ఈ స్కీం కింద కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లు, ఈ బైకులు, ఈ స్కూటీలు, మోటార్ బైకుల కోసం ఉచిత ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని పొందటానికి క్రిస్టియన్ మైనారిటీ వర్గానికి చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. కుట్టు మిషన్ మరియు చిన్న వ్యాపారాలు చేసే వారి వయసు 21 సంవత్సరాలు నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు.
జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు డెడ్ లైన్
ఈ బైక్, ఈ స్కూటీ, మోటార్ బైక్ కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు.ఈ దరఖాస్తుల ప్రక్రియ జులై మూడవ తేదీన ప్రారంభమై జులై 18వ తేదీ వరకు కొనసాగుతుంది. జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు లబ్ధిదారులు తమ పేర్లను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ప్రతి జిల్లాలోనూ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖను సంప్రదించాలి
పట్టణ ప్రాంతంలో ఉండే లబ్ధిదారుల వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు మరియు గ్రామీణ ప్రాంతంలో ఉండే వారి వార్షిక కుటుంబ ఆదాయం 150000 లోపు ఉండాలి. ఈ పథకాల కోసం మరిన్ని వివరాల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ వారిని సంప్రదించవచ్చు. ప్రతి జిల్లాలోనూ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖను సంప్రదించి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు, తెలంగాణా రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీలు అసలే నిర్లక్ష్యం చెయ్యొద్దు .













Click it and Unblock the Notifications