సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
Suravaram Sudhakar Reddy Passes Away: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి(83) తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారు. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. సురవరం సుధాకర్ రెడ్డి 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సురవరం సుధాకర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రామి రెడ్డి ఓ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియూ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పట్టా పొందారు. ఆయన 1974లో విజయలక్ష్మిని పెళ్లి చేసుకోగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

సురవరం సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుంచే సామాజిక, రాజకీయ ఉద్యమాలపై ఆసక్తి కనబరిచారు. విద్యార్థి దశలో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై సీపీఐలో చేరారు. ఆయన సీపీఐలో చాలా ఏళ్లు చురుకుగా పనిచేశారు. క్రమంగా కీలక నేతగా ఎదిగారు. సుదీర్ఘ కాలం పాటు సీపీఐలో పలు హోదాల్లో పని చేసిన సురవరం.. 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఉన్నంతకాలం పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా.. కార్మిక సంఘాల పోరాటాల్లో ముందు వరుసలో నడిచి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీశారు. వామపక్ష శక్తులను ఏకం చేయడానికి కృషి చేశారు.
1998, 1999 సంవత్సరాల్లో సురవరం సుధాకర్ రెడ్డి మానవ వనరుల అభివృద్ధి కమిటీ కింద పనిచేసే ఔషధ ధర నియంత్రణ ఉప కమిటీలో సభ్యునిగా ఉన్నారు. అదే సమయంలో ఆయన ప్రభుత్వానికి చెందిన అనేక సలహా బృందాలలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటైన సలహా కార్యవర్గంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలుపుున్నారు.
CPI announces with profound grief the passing of our beloved former General Secretary, Comrade S. Sudhakar Reddy.
— CPI - Communist Party of India (@CPI_National) August 22, 2025
A lifelong fighter, he served as GS of CPI & twice represented Nalgonda in Lok Sabha. He will be remembered for his humility & commitment.
Red Salute, Comrade! pic.twitter.com/sGQmolJ5hA
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications