వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందకుమార్ కు బిగుస్తున్న ఉచ్చు.. హీరో రానా ప్లాట్ వ్యవహారం, వరుస చీటింగ్ కేసులు!!

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నంద కుమార్ కు ఉచ్చు బిగుసుకుంటోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడైన నందకుమార్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నందకుమార్ పై మరో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫిలింనగర్లోని హీరో దగ్గుబాటి రానా ప్లాట్ ను లీజుకు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చిన క్రమంలో వాటిని అధికారులు కూల్చివేశారు. ఇక ఆపై నందు వ్యవహారాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ లలో అనేక కేసులు నమోదవుతున్నాయి.

దగ్గుపాటి రానా ప్లాట్ లీజుకు తీసుకుని నందు అక్రమనిర్మాణాలు

దగ్గుపాటి రానా ప్లాట్ లీజుకు తీసుకుని నందు అక్రమనిర్మాణాలు

ఫిల్మ్ నగర్ లోని రోడ్ నెంబర్ వన్ లో ఉన్న ప్లాట్ నెంబర్ 2లో సినీ హీరో దగ్గుబాటి రానా ఫ్లాట్ నందు లీజుకు తీసుకున్నాడు. ఈ ఫ్లాట్ లో జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడు. ఆపై వాటిని అద్దెకు ఇచ్చాడు. అయితే చట్టపరమైన హక్కులు లేకుండా ఈ ఫ్లాట్ లో నందకుమార్ నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు గత ఆదివారం నాడు కూల్చేశారు. దీంతో అక్కడ వ్యాపారం చేస్తున్నవారు నందకుమార్ తమ వద్ద డబ్బులు తీసుకుని అక్రమ కట్టడాన్ని అంటగట్టి మోసం చేశారని అతనిపై చీటింగ్ కేసు పెట్టారు.

నందకుమార్ మోసం చేశాడని వరుస ఫిర్యాదులు

నందకుమార్ మోసం చేశాడని వరుస ఫిర్యాదులు

ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటుకోసం ఎనిమిది లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారని, 40 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించానని, ఇప్పుడు ఈ కట్టడాన్ని అధికారులు కూల్చి వేశారని సంజయ్ రెడ్డి వాపోతున్నారు. ఇక డబ్బులు వసూలు చేసి మోసం చేసినందుకు నందు పై చర్యలు తీసుకోవాలని సంజయ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బాంబే గార్మెంట్ స్టోర్ పేరుతో తనకు ఒక అక్రమ కట్టడాన్ని నందకుమార్ అంటగట్టారు అని, దాని కోసం పెద్ద ఎత్తున అడ్వాన్స్ కూడా ఇచ్చానని, లక్షలాది రూపాయలను ఇంటీరియర్ కోసం ఖర్చు చేశానని ఇందిరా అనే మహిళ, తనను నందకుమార్ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరుసగా నందకుమార్ పై నమోదవుతున్న కేసులు

వరుసగా నందకుమార్ పై నమోదవుతున్న కేసులు


ఇక ఇటీవల అనధికారిక కట్టడంగా కూల్చివేసిన రానా కు చెందిన ప్లాట్లో బరిస్టా స్టోర్ ను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నామని, దీనికోసం అడ్వాన్సు ఇచ్చానని, ఇంటీరియర్ చేసుకున్నానని, తనను నందకుమార్ మోసం చేశాడంటూ బంజారాహిల్స్ కు చెందిన ఆశిజ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే నందకుమార్ పై డెక్కన్ కిచెన్ హోటల్ యజమాని సయ్యద్ అయాజ్, మొబైల్ యాక్సెసరీస్ గ్యాడ్జెట్ స్టూడియో యజమాని సందీప్ కుమార్ కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికి నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసులు

ఇప్పటికి నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసులు

ఇక తాజాగా మరో ముగ్గురు నందకుమార్ పై చీటింగ్ చేశారని ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు నందకుమార్ పై ipc సెక్షన్ 406, 420, 506 కింద కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసు నమోదు అయినట్టుగా తెలిసింది. దీంతో నంద కుమార్ కు ఉచ్చు బిగుసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

English summary
A series of cases are being registered against Nandakumar, who is accused in the case of buying MLAs. Cheating cases have been registered against Nandakumar with complaints that he cheated them by illegal construction in the plot of hero Rana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X