బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం.. హైదరాబాద్ నడిబొడ్డున షాకింగ్ దందా!!
భాగ్యనగరి కేంద్రంగా బ్యూటీ పార్లర్ పేరుతో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. తాజాగా నగరం నడిబొడ్డున దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్ థియేటర్ సమీపంలో సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ లో సాగుతున్న వ్యభిచార దందాను వెలుగులోకి తెచ్చారు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు. సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ లో అక్కడ పనిచేస్తున్న అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ పై పోలీసుల దాడులు
హైదరాబాద్ మహానగరంలో ఈ ఏరియా, ఆ ఏరియా అని లేకుండా అన్ని చోట్ల విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుంది. గతంలో జూబ్లీ హిల్స్ లోనూ ఒక స్పా లో వ్యభిచార దందా గుట్టు రట్టు చేశారు. అయినప్పటికీ ఇంకా గుట్టు చప్పుడు కాకుండా దందా సాగుతూనే ఉంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, పోలీసులకు అనుమానం రాకుండా వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. గతంలోనూ బ్యూటీ పార్లర్ లలో ఇటువంటి వ్యభిచార గ్యాంగ్ లు అనేకం పట్టుబడ్డాయి. తాజాగా అమాయకమైన అమ్మాయిలని తమ ట్రాప్ లోకి లాగి వారితో వ్యభిచారం దందా చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నట్టు గుర్తించిన సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ పై పోలీసులు దాడులు చేశారు .

వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు.. విటుడు అరెస్ట్
ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన ఈ దాడులలో లోపల అనేక షాకింగ్ దృశ్యాలు వెలుగుచూశాయి. అయితే అప్పటికే పోలీసుల రాకను గమనించిన సిగ్నేచర్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు పరారు కాగా విటుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు అతడిని సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అరెస్టు చేసిన విటుడు ఒక క్లాత్ షోరూమ్ కి యజమాని గా గుర్తించారు.

నిర్వాహకులు పరారీ... గాలింపు చేపట్టిన పోలీసులు
అయితే బ్యూటీ పార్లర్ నిర్వాహకులు అందరూ పారిపోవడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక వీరికి మరే ఇతర ప్రాంతాల్లో అయినా బ్రాంచ్ లు ఉన్నాయా అన్నది దర్యాప్తు చేస్తున్నారు . ఇక ఈ తరహా బ్యూటీపార్లర్లు నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదానిపై ఎస్ఓటీ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇలా తప్పుడు పనులకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలో ఈ తరహా దందా నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ల వేట మొదలు పెట్టారు పోలీసులు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications