హైదరాబాద్‌లో ఘోరం: అమ్మాయిపై లైంగిక దాడి, 20 రోజులుగా హోటల్‌లో బందీగా..
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికను ట్రాప్ చేసిన ఓ యువకుడు, లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీరా పెళ్లి పేరు ఎత్తగానే హోటల్ గదిలో ఆ అమ్మాయిని బంధించి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. భైంసాకి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆ యువకుడు హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ కోర్సు చేస్తున్నాడు. అతని ట్రాప్‌లో చిక్కుకున్న బాలికకు పెళ్లిపేరిట మాయమాటలు చెప్పి బలవంతంగా హైదరాబాద్ నగరానికి రప్పించాడు.

అనంతరం నారాయణగూడలోని ఓ హోటల్ గదిలో 20 రోజులుగా నిర్బంధించి, లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక కోరడంతో హోటల్ రూంకుకు తాళం వేసి, అక్కడ నుంచి పరారయ్యాడు యువకుడు. ఎట్టకేలకు బాలిక, తన ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అదించి, వాట్సాప్‌లో లోకేషన్ షేర్ చేసింది.
ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని షీ టీమ్స్, నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. నారాయణగూడలోని హోటల్‌లో బాధితురాలి లోకేషన్ గుర్తించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలికను కాపాడారు. ఆ అమ్మాయి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసిన నారాయణ గూడ పోలీసులు, రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications