కామారెడ్డి నుండి పోటీపై తేల్చేసిన షబ్బీర్ అలీ

తెలంగాణ సీఎం కెసిఆర్ ఒక్క గజ్వేల్ నియోజకవర్గం నుండి మాత్రమే కాకుండా కామారెడ్డి నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్నారని, ఈ క్రమంలో కామారెడ్డి నుండి పోటీ చేయడానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ భయపడుతున్నారని, ఆయన కామారెడ్డి నుండి పోటీ చేసే ఆలోచనలో లేరని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆయన కామారెడ్డిలో పోటీపై క్లారిటీ ఇచ్చారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉంటానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నేడు పర్యటించిన ఆయన తను కామారెడ్డి నుండి పోటీ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కామారెడ్డి వదిలిపోనని స్పష్టం చేశారు.

 Shabbir Ali clarity on his contest from Kamareddy

ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, ఇది తనపై కావాలని జరుగుతున్న దుష్ప్రచారం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని, కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని షబ్బీర్ అలీ ప్రకటించారు.

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా షబ్బీర్ అలీ పేరు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో లేకపోవడంతో, షబ్బీర్ అలీ అక్కడ నుండి చేయడం లేదని ప్రచారం జరిగింది. కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ కాకుండా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని కూడా జోరుగా ప్రచారం సాగింది. సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారని చర్చ సాగింది.

అయితే ఈ ప్రచారాలకు చెక్ పెడుతూ షబ్బీర్ అలీ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీన కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+