కోదాడలో ఆమెదే హవా; ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు షాడో షాక్; హాట్ టాపిక్!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇప్పటినుంచే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన పార్టీ నేతలను అసమ్మతి రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల మాట పక్కన పెట్టి స్వపక్షనేతలే కొట్టుకు చావడం ప్రధానంగా బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతుంది. ఎక్కడ చూసినా ఆధిపత్య పోరు రాష్ట్రంలో కనిపిస్తూ ఉండడం గులాబీ బాస్ కు మింగుడు పడడం లేదు. ఇక సూర్యాపేట జిల్లాలోని కోదాడలో అయితే.. పరిస్థితి మరీ దారుణంగా, ఒకింత విచిత్రంగా ఉంది.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యేకు బదులు ఒక మహిళా నేత షాడో ఎమ్మెల్యేగా అక్కడ చక్రం తిప్పుతున్నారన్న చర్చ జరుగుతుంది. ఓ మహిళా ఎంపీపీ పెత్తనం పై, ఆ మహిళా ఎంపీపీకి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తున్న బొల్లం మల్లయ్య యాదవ్ పై అసంతృప్తితో ఉన్న నేతలంతా ఆయన తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

mlabollammallaiahyadav

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దూకుడు పెంచి, ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజా క్షేత్రంలోకి వెళుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రారావు, 2014 సంవత్సరంలో బిఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ ఎవరికివారు ఎమ్మెల్యే తో సంబంధం లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే తీరును బాహాటంగా విమర్శిస్తున్న సందర్భాలు కూడా లేకపోలేదు.

అధికారిక, అనధికారిక కార్యక్రమాలలోనూ మహిళా ఎంపీపీ అక్కడ ఎమ్మెల్యే తరహాలో చక్రం తిప్పటం అక్కడి శ్రేణులకు ఏ మాత్రం నచ్చటం లేదని చర్చ జరుగుతుంది. ఇక అధికార వర్గాలలో కూడా ఎమ్మెల్యే తీరుపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పాల్గొనే ప్రతీ కార్యక్రమంలో ఆ మహిళా ఎంపీపీకి కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిందే అని చర్చ జరుగుతుంది. సొంత పార్టీ నేతలు కూడా ఆమెను ఎమ్మెల్యేనే ఎంకరేజ్ చేస్తున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అక్కడ షాడో రాజకీయం రసవత్తరంగా మారింది.

 bollam

ఇక మహిళా ఎంపీపీ విషయంలో ఆయన ప్రవర్తన పైన స్థానికంగా రచ్చ కొనసాగుతున్నా ఎమ్మెల్యేకు మాత్రం చీమ కుట్టినట్టు లేదని అందరూ అనుకుంటున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇస్తారా? ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడా? ఎమ్మెల్యే మల్లయ యాదవ్ కు షాడో షాక్ తగులుతుందా? అన్నది స్థానికంగా ఆసక్తికరమైన చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+