Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్లోబల్ స్టేజ్ పై పుష్ప పాట.. షేకింగ్ పర్ఫార్మెన్స్.. తగ్గేదేలే.. వీడియో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'పుష్ప' నిజమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. పుష్ప, పుష్ప టు రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సూపర్ యాక్టింగ్ తో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టింది.

పుష్ప ... తగ్గేదేలే
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందేలా చేసింది. ఈ సినిమా పాటలతో పాటు 'తగ్గేదేలే' అనే బన్నీ మేనరిజం ఇప్పుడు చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ల వరకు, రాజకీయ నాయకుల నుండి అంతర్జాతీయ క్రీడాకారుల వరకు ప్రతి ఒక్కరికి అలవాటయింది. తాజాగా, 'పుష్ప' చిత్రం మరో అరుదైన మైలురాయిని అధిగమించింది.

Shaking performance with Pushpa movie song on the global stage agt thaggedele video viral

అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20' వేదికపై 'పుష్ప' పాట సందడి
ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ టాలెంట్ షో 'అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20' వేదికపై 'పుష్ప' సినిమా పాట సందడి చేసింది. భారతదేశానికి చెందిన 'బీ యూనిక్ క్రూ' బృందం ఈ కార్యక్రమంలో 'పుష్ప' సినిమాలోని 'దాక్కో దాక్కో మేక' పాటకు అద్భుతమైన డాన్స్ చేశారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో, జిమ్నాస్టిక్స్‌ను జోడించి చేసిన ఈ ఈ డాన్స్ అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20 న్యాయమూర్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

బీ యూనిక్ క్రూ చేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా
వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ ప్రదర్శనను చూసిన న్యాయమూర్తులు ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనగా అభివర్ణించారు. వారిని అంతకు ముందు ఒక షో జడ్జి, ఇండియాకు చెందిన డాన్సింగ్ టీమ్ ను ఎవరు మీరు?" అని ప్రశ్నించగా, డ్యాన్స్ బృందం సభ్యులు "మేం బీ యూనిక్ క్రూ, ఇండియా నుంచి వచ్చాం" అని సమాధానం ఇచ్చారు. ఈ టీం చేసిన డాన్స్ కు, ప్రదర్శనకు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

షేర్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
ప్రపంచ ప్రఖ్యాత డాన్సింగ్ స్టేజ్ పైన మన భారతీయ సినిమాలోని తెలుగు పాట అత్యుత్తమ ప్రదర్శనకు ప్రశంసలు అందుకోవడం విశేషం. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ అభిమానులు తమ సోషల్ మీడియా ప్లాట్ఫారం మీద షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ పర్ఫార్మన్స్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్లంతా "ఇది పుష్పగాడి రూల్", "పుష్ప తగ్గేదేలే" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా
దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'పుష్ప' టు సినిమా ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప'కు ఉన్న క్రేజ్‌ కు నిదర్శనంగా ఒక అంతర్జాతీయ మ్యాచ్ మధ్యలో సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రదర్శన జరిగింది. అలాగే, గ్లోబల్ స్థాయిలో 'పుష్ప 2' నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త రికార్డు సృష్టించి, ఏడు దేశాల్లో టాప్ మూవీగా నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+