సినిమా ఇండస్ట్రీ కాకుంటే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా: నాగబాబు వ్యాఖ్యలకు శివాజీ షాకింగ్ రియాక్షన్
హీరోయిన్ల వస్త్రధారణ పైన శివాజీ చేసిన వ్యాఖ్యల కాంట్రవర్సీ చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల దుస్తులపైన శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, శివాజీ వాడిన భాషపై మొదట తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, నా బాడీ నా ఇష్టం అంటూ అనసూయ వ్యాఖ్యలు చేయడంతో ప్రజల మద్దతు ఒక్కసారిగా శివాజీకి మారింది.
ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో కొట్టమన్న శివాజీ
సోషల్ మీడియా వేదికగా శివాజీని సమర్థిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే విభిన్న వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా శివాజీ వ్యాఖ్యల పైన జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పైన మండిపడిన ఆయన ఆడవాళ్ళ బట్టల పై మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఆడబిడ్డల జోలికొస్తే చెప్పుతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో మోరల్ పోలీసింగ్ రుగ్మత ఉందన్న నాగబాబు
శివాజీ తన టార్గెట్ కాదని మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఇక నాగబాబుకు కొందరు మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారని అది వాళ్ళ మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్ల కాబట్టి ఇలానే ఉండాలి అనుకోవడం తప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తనపై కుట్రలు చేస్తున్నారన్న శివాజీ
సమాజం మారిపోతుందని ఏఐ లోకి వచ్చినా కూడా మగాళ్ళ మనస్తత్వం మారకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు ఆడపిల్ల ఇలాగే ఉండాలి అని చెప్పడం పెద్ద క్రైమ్ అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శివాజీ కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని, తన పైన ఇంతగా కుట్రలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
నటుడిగా కాకుంటే వ్యవసాయం చేసుకుంటా
నటుడిగా తనకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఆ భగవంతుడు సేవ చేయడానికి పంపాడని, ఇండస్ట్రీలో సాధ్యం కాకపోతే తనకు 30 ఎకరాల పొలం ఉందని, తను రైతు బిడ్డను అని, ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటానంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేతప్ప ఎవరికీ భయపడేది లేదని శివాజీ తేల్చి చెప్పారు. తాను భయపడే రకాన్ని కాదన్నారు. ఇది పొగరు కాదని, తన ఆత్మాభిమానం అని ఆయన అన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ఎవరి అంతరాత్మకు వాళ్లకే తెలుసని నటుడు శివాజీ వ్యాఖ్యలు చేశారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications