జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. కోర్టులో జరిగిందిదే!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని మరో బిగ్ షాక్ తగిలింది. టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన 21సంవత్సరాల యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే ముంబైలో తనను రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ మీద pocso చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్
ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్ చంచల్ గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు . తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని జానీ మాస్టర్ తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో జానీ మాస్టర్ కు చుక్కెదురైంది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.

Shock for johnny master court cancelled Johnny Master regular bail petition

బెయిల్ పై వచ్చిన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దుతో మళ్ళీ జైలుకు
అయితే జైల్లో ఉన్న జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని బెయిల్ కోసం అప్లై చేసిన సమయంలో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు ఇవ్వవలసిన నేషనల్ అవార్డును రద్దు చేశారు .దీంతో ఆయన బెయిల్ కూడా రద్దయి మళ్ళీ జానీ మాస్టర్ జైలుకు వెళ్లవలసి వచ్చింది.

బెయిల్ పిటీషన్ కొట్టివేసిన కోర్టు
ఇక ఈ కేసులో తనకు సాధారణ బెయిల్ ఇవ్వాలని జానీ మాస్టర్ కోరినప్పటికీ విచారణ అనంతరం కోర్టు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం జానీ మాస్టర్ పరారు కాగా, గోవాలో పోలీసులు జానీ మాస్టర్ ని పట్టుకొని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

పోలీసుల కస్టడీలో ముఖ్య విషయాలు చెప్పిన జానీ మాస్టర్
ఆపై పోలీసులు ఆయనను విచారించడానికి ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా, కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. దీంతో కోర్టు అనుమతితో జానీ మాస్టర్ ను విచారించిన పోలీసులకు జానీ మాస్టర్ పలు కీలక విషయాలను వెల్లడించారు.అయితే జానీ మాస్టర్ ఈ కేసులో తనను కావాలని కొందరు ఇరికించారని, తనపై ఫిర్యాదు చేసిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేసిందని, తనను పదేపదే బ్లాక్ మెయిల్ చేసిందని జానీ మాస్టర్ నార్సింగి పోలీసుల విచారణలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+