కేటీఆర్ కు షాక్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు!!
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఇదే క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది.
కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై తాజాగా చేసిన వ్యాఖ్యలతో హనుమకొండ పోలీసులకు బత్తిని శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంతో కేటీఆర్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయల వసూలు చేశారని, కాంగ్రెస్ పెద్దలకు పంపించారని తాజాగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ భవన్లో జరిగిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామంత రాజులాగా రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టారని ఆరోపించారు. దీనికోసం రేవంత్ రెడ్డి అందరిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
ఇక ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పైన మండిపడుతున్నారు. బత్తిని శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత హనుమకొండ పోలీసులకు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు కేసును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దీంతో కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు ipc సెక్షన్ 504, 502 (2) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications