వాహనదారులకు షాక్.. ఇకపై కొత్త ట్రాఫిక్ రూల్స్.. అది లేకుంటే కష్టమే!
హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కావడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ కు తగ్గట్టు ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా, వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా రహదారులపై తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. దీంతో పాటు పొల్యూషన్ కూడా విపరీతంగా పెరుగుతుంది.
ఆ విషయంలో వాహనదారులకు అలెర్ట్
ఇలా వాహనాల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూ పొల్యూషన్ ఎక్కువ కావడం నగరవాసులకు పెద్ద సమస్యగా పరిణమించింది ఈ క్రమంలోనే ఈ సమస్యపై దృష్టి సారించిన రవాణా శాఖ ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పొల్యూషన్ విషయంలో వాహనదారులపై కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయింది.

పీయూసీ సర్టిఫికెట్ స్థితి ధృవీకరణ.. ఆపై చాలాన్లు
తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో కలిపి రియల్ టైం ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థతో నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను పరీక్షించి వాటి పియుసి సర్టిఫికెట్ స్థితిని ధ్రువీకరిస్తాయి. పియుసి సర్టిఫికెట్ లేని వాహనాలను గుర్తించి ముందుగా ఆ యజమానులను అలర్ట్ చేస్తూ సందేశాలు పంపుతాయి. ఆ తరువాత ఈ చలాన్ లను జారీ చేస్తాయి.
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా డిజిటల్ చలానా విధానం
కాలుష్య నియంత్రణ కోసం చేసే ఈ చర్యలకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఏ విధంగా అయితే డిజిటల్ చలానా విధానం అమలులో ఉందో అదే తరహాలో డిజిటల్ చలానా విధానం పనిచేస్తుంది. హైదరాబాద్ నగరంలోని వెహికలర్ పొల్యూషన్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా పియుసి సర్టిఫికెట్లు ఆన్లైన్లో రీజనరేట్ చేస్తారు. ఈ విధానంలో ఆన్లైన్ ద్వారానే చలాన్లు వాహదారులకు చేరుతాయి.
నగర ప్రజల శ్రేయస్సు కోసమే కఠిన నిర్ణయం
ఇక ప్రతి వాహనం, దాని చరిత్ర ఆధారంగా చలాన్ల సంఖ్య పెరిగితే దానికి సంబంధించిన యజమాని వాహనానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడం కోసం తీసుకొస్తున్నటువంటి ఈ విధానం నగర ప్రజల శ్రేయస్సు కోసమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
వాహనాదారులు తస్మాత్ జాగ్రత్త
కాలుష్యాన్ని తగ్గించి నగరవాసుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకొని దీనిని కఠినంగా అమలు చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రెడీ అయ్యారు. ఇకపై పొల్యూషన్ క్రియేట్ చేసే వాహనాలు ఏవైనా ఉంటే ఆ వాహన యజమానులు తస్మాత్ జాగ్రత్త.












Click it and Unblock the Notifications