కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సిట్టింగ్ ఎంపీ!!
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, గులాబీ అధినేత కెసిఆర్ కు ఊహించని భారీ షాక్ తగిలింది. త్వరలో లోక్సభ ఎన్నికలకు దేశమంతా సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోనూ దూకుడుగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తే కెసిఆర్ కు బీఆర్ఎస్ ఎంపీలు ఊహించని షాక్ ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీ ఫిరాయించేందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి ని కలుస్తుండగా, మరికొందరు నేతలు నేరుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Recommended Video

ఆయన ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు గులాబీ పార్టీ ముఖ్య నేతలు కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామంతో పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వెంకటేష్ నేత పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా విజయం సాధించారు. గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ ఆయన తన సొంత గూటికే చేరుకున్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత..!!#VenkateshNetha #BRS #Congress #PeddpalliMP #Telangana #Oneindiatelugu pic.twitter.com/FFDbTxMc3T
— oneindiatelugu (@oneindiatelugu) February 6, 2024
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత తొలిసారిగా కెసిఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణ, రానున్న పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఇక ఇదే సమయంలో అధినేతకు షాక్ ఇచ్చి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోను, రాజకీయ వర్గాలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications