కేసీఆర్ కు షాక్.. ఆ పార్టీలోకి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి?

తెలంగాణ ముఖ్యమంత్రి ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి ని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్ రెడ్డి గత కొద్దిరోజులుగా బి ఆర్ ఎస్ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో, ఎన్నికలకు సమయం దగ్గర పడిన తరుణంలో ఆయన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు షాక్ ఇవ్వబోతున్నారు.

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారని ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. బేతి సుభాష్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు తమ నాయకుడికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలంటూ వాట్సప్ గ్రూపులలో పెద్ద ఎత్తున పోరాటమే చేశారు.

shock to KCR.. Uppal MLA Bethi Subhash Reddy ready to join in bjp!!

బేతి సుభాష్ రెడ్డి 2001 నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నందుకా.. ఎన్నో కేసులలో జైలుకు వెళ్లినందుకా ..ఉద్యమ సమయంలో వేలాది మంది ఉద్యమకారులకు అన్నం పెట్టినందుకా? అంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బేతి సుభాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని... అలా టికెట్ ఇవ్వకపోతే అందుకు కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.

టికెట్ కేటాయింపు చేసిన నాటి నుండి ఇప్పటివరకు తీవ్ర అసంతృప్తితో, కెసిఆర్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బేతి సుభాష్ రెడ్డి తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావటంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బి ఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న బేతి త్వరలో పార్టీ మారనున్నారు.

గులాబీ అధినేత కెసిఆర్ కు షాక్ ఇస్తూ, బిజెపి తీర్థం పుచ్చుకోవాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కక పోవడంతో మనస్థాపంతో ఉన్న ఆయన ఢిల్లీలో బిజెపిలో చేరడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. తెలంగాణా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బేతి సుభాష్ రెడ్డి లాంటి అసంతృప్త నేతలు, జంపింగ్ జపాంగ్ లతో రాజకీయాలు ఎలా మారతాయో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+