ఈడీ కస్టడీలో కవిత షాకింగ్ దినచర్య; నేడు తనయను కలవనున్న తల్లి శోభ!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం ఈడి కస్టడీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి కస్టడీలో విచారణతో పాటు దినచర్యలో భాగంగా ఏం చేస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్యానం చేస్తూ భగవద్గీత పఠనం చేస్తూ తన దినచర్యను కొనసాగిస్తున్నారు. నిన్న ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష ఆచరించిన కవిత కేవలం పండ్లు మాత్రమే తీసుకున్నారు.

స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని తెప్పించుకొని చదువుతున్నారని సమాచారం. అంతే కాదు అందులో ఉన్న ముఖ్యమైన విషయాలను అంశాలను కవిత డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారట. అయితే నిన్న కవితను ఈడి అధికారులు ఉదయం 10 గంటల నుంచి కొద్దిసేపు మాత్రమే విచారణ జరిపారు. ఆపై మధ్యాహ్నం లంచ్ తర్వాత కొద్దిసేపు ప్రశ్నించారు.

Shocking daily routine of MLC Kavitha in ED custody Bhagavad Gita reading and doing meditation

ఇతర కేసుల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ డి అధికారులు నిన్న కవిత ను ఎక్కువసేపు విచారించలేదు అయితే నిన్న కవిత పిఏని, సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత ఇంట్లో సోదాల సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా కవిత మీడియా పిఆర్ఓ ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 16 మంది ఫోన్లను ఈడి అధికారులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు.

వారి ఫోన్ నంబర్లు, పాస్ వర్డ్ లు రాసుకుని 11మంది ఫోన్లు తిరిగి ఇచ్చేశారు. అయితే కవిత భర్త అనిల్, పిఆర్ఓ రాజేష్, పిఎ శరత్ కుమార్, సిబ్బంది రోహిత్ రావుల ఫోన్లను కవిత ఫోన్లతో పాటుగా ఈడి డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం కవిత విచారణ సందర్భంగా ఆమె పిఆర్ఓ రాజేష్ ను, సిబ్బంది రోహిత్ రావును నిన్న ఈడి అధికారులు విచారించారు.

Shocking daily routine of MLC Kavitha in ED custody Bhagavad Gita reading and doing meditation

ఇదిలా ఉంటే కవిత భగవద్గీత పఠనం తో పాటు, ఇండియన్ పొలిటికల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని పుస్తకాలను కూడా అడిగి తెప్పించుకున్నారు. అంబేద్కర్ జీవిత గాథ, ఏఎస్ పన్నీరు సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభన కె నాయుడు రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వెదర్ మెన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను కవిత అడిగి తెప్పించుకుని వాటిని చదువుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈడి కస్టడీలో ఉన్న కవితను నాలుగవ రోజు కూడా కేటీఆర్ కలిశారు. అడ్వకేట్ మోహిత్ రావును వెంటబెట్టుకుని కవితను కలిసిన కేటీఆర్ సుప్రీంకోర్టులో ఈ కేసు నుండి ఉపశమనం దొరికేలా చర్యలు తీసుకుంటున్నట్టు, కవితకు ధైర్యం చెప్పారు. ఇక నేడు కవిత తల్లి శోభ ఆమెను కలవనున్నారు. కుమార్తెకు ధైర్యం చెప్పనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+