లోక్ సభ ఎన్నికల వేళ వాళ్లకు చెప్పులదందలతో షాకింగ్ ఫ్లెక్సీలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎండని సైతం లెక్కచేయకుండా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో మాత్రం ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కాలనీలలో ఫ్లెక్సీలు
వరంగల్ జిల్లా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పార్టీల ఫిరాయింపులతో విసిగి వేసారి పోయిన ప్రజలు అనేక చోట్ల ఆసక్తికర ఫ్లెక్సీలను ప్రదర్శించి రాజకీయ నేతలను తూర్పారబడుతున్నారు. తాజాగా పార్టీ మారిన నేతలను హెచ్చరిస్తూ కార్టూన్ లతో ఫ్లెక్సీలు రూపొందించి చెప్పుల దండలు వేస్తూ ఆ ఫ్లెక్సీలను కాలనీలలో ఏర్పాటు చేశారు.

గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్
వరంగల్ జిల్లాలోని పలు కాలనీలలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్ అంటూ కార్టూన్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వరంగల్ ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక పార్టీ నుంచి పోటీ చేసిన వారికి ఓటేస్తే ఇంకొక పార్టీలోకి మారుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్యలు పట్టించుకోరా.. మీ పతనానికి చరమ గీతం ముందుందని హెచ్చరిస్తున్నారు.
వరంగల్ నగరంలో ఫ్లెక్సీలపై చర్చ
నగరంలో అనేక చోట్ల ఫ్లెక్సీలపై రాతలతో ప్రజలు రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలపై వరంగల్ నగరంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది .వరంగల్ లోక్సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీలు మారిన వ్యవహారాన్ని ఇప్పుడు అందరు గుర్తు చేసుకుంటున్నారు.
వరంగల్ లో లోక్ సభ ఎన్నికలకు ముందు జోరుగా ఫిరాయింపులు
గతంలో బీఆర్ఎస్ పార్టీలో వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరి బిజెపి నుండి లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత కడియం కావ్య ప్లేటు ఫిరాయించి తాను పోటీ చేయబోనని ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇలా నేతలు పార్టీలు ఫిరాయించడంతో అసహనంతో ఉన్న ప్రజలు గోడలు దూకే నాయకులారా ఖబర్దార్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications