హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన నాలుగేళ్ల బాలుడు
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. భయంతో బాలుడు కేకలు వేయడంతో గమనించిన అపార్ట్ మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్‌ల సాయంతో లిఫ్ట్ డోర్‌లు కట్ చేసి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.
ఈ క్రమంలోనే స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని అత్యవసర చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.













Click it and Unblock the Notifications