షాకింగ్ : యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను విధ్వంసం చేసే కుట్ర!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప కట్టడం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రామప్ప పరిసరాలలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

రామప్ప పరిసరాలలో జియాలాజికల్ సర్వేపై అనుమానం
ఇటీవల రామప్ప పరిసరాలలో జియాలాజికల్ సర్వే నిర్వహించడం పైన ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ కుట్ర చేస్తూ యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా సంపద రామప్ప దేవాలయాన్ని, రామప్ప సరస్సును విధ్వంసం చేసే కుట్ర జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వ్యతిరేకిస్తుంది అని తేల్చి చెప్పారు.

shocking news A conspiracy to destroy the UNESCO-recognized Ramappa

Take a Poll

గతంలో కేసీఆర్ బొగ్గు మైనింగ్ కు విముఖత
గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామప్ప పరిసరాల్లో బొగ్గు మైనింగ్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తెస్తే తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బొగ్గు నిల్వలు అక్కడ లేవని సాధారణ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని చరిత్ర కలిగిన రామప్ప సరస్సు, దేవాలయం విధ్వంసానికి గురయ్యే అవకాశం ఉన్నందున దానిని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ వ్యతిరేకించారని పేర్కొన్నారు.

ఓపెన్ కాస్ట్ చేస్తే రామప్ప ఆలయం, చెరువుకు ప్రమాదం
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో దేవాదుల ఫేజ్ - 3 లో భాగంగా 9 టీఎంసీ ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటు చేసి రామప్ప- పాకాల, రామప్ప - రంగయి చెరువు ద్వారా నీళ్లు ఇవ్వటం జరిగిందని పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. రామప్ప పరిధిలో ఇలాంటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ప్రాజెక్ట్ తో రామప్ప ఆలయం, సరస్సు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్ ఆలోచన?
రామప్ప చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఓపెన్ కాస్ట్ లు చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం ఇటీవల జియాలాజికల్ సర్వే నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఒకవేళ అదే కనక ప్రభుత్వ ఆలోచన అయితే దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+