రౌడీలను తీసుకొచ్చింది: నటుడు విజయ్ స్నేహితుడు, ఆర్టిస్ట్ నుంచి పెళ్లి.. ఎవరీ వనిత?
హైదరాబాద్: నటుడు విజయ్ సాయి ఆత్మహత్య అనేక మలుపులు తిరుగుతోంది. ఆయన భార్య వనిత, అతని తండ్రి సుబ్బారావుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ స్నేహితుడు శివశంకర్ ఆత్మహత్యపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె వనితను తప్పుబట్టారు.
Recommended Video

విజయ్ ఆత్మహత్యకు వనిత కారణమని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యకు ముందు రోజు నలుగురు రౌడీలతో వచ్చిందని ఆరోపించారు. ఆమె బలవంతంగా విజయ్ కారును తీసుకు వెళ్లిందని ఆరోపించారు. వనిత మొదటి భర్త విజయనగరంలో ఉన్నారని చెప్పారు.

వనిత మొదటి భర్తకు దూరంగా ఉంటూనే
వనిత మొదటి భర్త మూడేళ్లుగా దూరంగా ఉంటున్నప్పటికీ ఆమెకు ఫైనాన్షియల్‌గా అండగా ఉంటున్నారని చెప్పారు. ఆమెకు స్విఫ్ట్ కారు కొనిచ్చారని చెప్పారు. వనితను, ఆమె మొదటి భర్తను ఎదుర్కొనే ధైర్యం తనకు లేదని విజయ్ సాయి చెప్పారని శివశంకర్ అన్నారు.

పాపపై ప్రేమ, దానిని అడ్డు పెట్టుకొని
విజయ్ సాయికి పాప వందన కుందన అంటే ఎంతో ఇష్టం, ప్రాణం అని చెప్పారు. ఆ పాపను అడ్డుపెట్టుకొని వందన డబ్బులు డిమాండ్ చేసిందని ఆరోపించారు. వనితతో ఇబ్బందులు తట్టుకోలేక విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన వాపోయారు.

మా అక్క అందుకే దూరంగా ఉంటోంది
మరోవైపు, వనిత సోదరుడు కూడా స్పందించారు. విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని, అందుకే తన అక్క ఆయనకు దూరంగా ఉంటోందని చెప్పారు. తన అక్క ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

కారు చుట్టూ వివాదం
విజయ్ సాయి ఆత్మహత్యపై నటుడు ఉత్తేజ్, దర్శకులు రవిబాబు పలువురు స్పందించారు. అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదన్నారు. సినిమా అవకాశాలు లేక ఆత్మహత్య అనేది అవాస్తవమని చెప్పారు. ఆయన ఆత్మహత్యకు ఏదో బలమైన కారణం ఉందన్నారు. కాగా కారు వల్ల కూడా ఇరువురి మధ్య వివాదం ముదిరిందని కూడా తెలుస్తోంది.

వనితకు చిన్న వయస్సులో పెళ్లి, విజయ్‌తో పరిచయం ఇలా
వనితకు మొదటి భర్త ఉన్న విషయం తెలిసిందే. అతనితో 13 ఏళ్లకే ఆమెకు పెళ్లయిందని తెలుస్తోంది. సరైన వయస్సులో పెళ్లి కాకపోవడంతో ఆమె తిరిగి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చి జూనియర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడింది. బ్యాచిలర్ సినిమా సమయంలో విజయ్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఇంటి నుంచి స్కోడా కారు, బంగారు నగలు తీసుకు వచ్చింది. దీంతో వనితను ఇంట్లోకి రానివ్వలేదు. ఆ తర్వాతే విజయ్‌కు చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకుందని అంటున్నారు. లింకులు వద్దని వారించినా వినలేదని ఆమె ఆరోపిస్తోంది. దీంతో అతనికి దూరంగా జరిగినట్లు చెబుతోంది.
-
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications